స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే సినీ కెరీర్ లో చెత్త సినిమా ఏదో మీకు తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు 2022 సంవత్సరం కలిసిరాలేదనే చెప్పాలి.ఈ ఏడాది పూజా హెగ్డే నటించిన సినిమాలలో ఒక్క సినిమా కూడా బ్రేక్ ఈవెన్ కాలేదు.

 Pooja Hegde Shocking Comments About Mohanzodaro Movie Details, Pooja Hegde, Mohe-TeluguStop.com

అదే సమయంలో పలు సినిమాలలో పూజా హెగ్డే పర్ఫామెన్స్ కు నెటిజన్ల నుంచి నెగిటివ్ కామెంట్లు వ్యక్తమయ్యాయి.అయితే తాజాగా పూజా హెగ్డే తన సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో తాను నటించిన 6 సినిమాలు వరుసగా సక్సెస్ సాధించడం నా బిగ్గెస్ట్ సక్సెస్ అని ఆమె తెలిపారు.

మొహంజోదారో మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ రిజల్ట్ ను అందుకోవడం లోయెస్ట్ పాయింట్ అని ఆమె కామెంట్లు చేశారు.

నా సినీ కెరీర్ లో మొహంజోదారో సినిమా చెత్త సినిమా అని ఆమె చెప్పుకొచ్చారు.నా లీస్ట్ సినిమా ఏదని చెబితే ఆ సినిమా పేరు చెబుతానని మొహంజోదారో డిజాస్టర్ రిజల్ట్ ను అందుకోవడంతో ఏడాది పాటు నాకు ఆఫర్లు రాలేదని ఆమె చెప్పుకొచ్చారు.

మొహంజోదారో ఫ్లాప్ రిజల్ట్ వల్ల తనను ఐరన్ లెగ్ అని కూడా కామెంట్ చేశారని ఆమె తెలిపారు.

ఆ సమయంలో అల వైకుంఠపురములో సినిమాతో బ్రేక్ వచ్చిందని ఆమె తెలిపారు.

Telugu Disaster, Mohenzodarao, Pooja Hegde, Poojahegde, Tollywood-Movie

అల వైకుంఠపురములో సక్సెస్ తర్వాత కెరీర్ విషయంలో వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదని ఆమె వెల్లడించారు.అల వైకుంఠపురములో సినిమా నా కెరీర్ ను అద్భుతంగా మార్చిందని పూజా హెగ్డే పేర్కొన్నారు.పూజా హెగ్డే నటించిన మొహంజోదారో సినిమా 2016 సంవత్సరంలో విడుదలైంది.

Telugu Disaster, Mohenzodarao, Pooja Hegde, Poojahegde, Tollywood-Movie

అయితే ఐదేళ్ల క్రితం ఫ్లాపైన సినిమా గురించి పూజా హెగ్డే ఇప్పుడు నెగిటివ్ కామెంట్లు చేయడం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.కథ నచ్చకపోతే సినిమాలో నటించకుండా ఉండాలని అలా కాకుండా హిట్టైన సినిమాలు గొప్ప సినిమాలు, ఫ్లాపైన సినిమాలు చెత్త సినిమాలు అని పూజా హెగ్డే చెప్పడం సరికాదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube