వీరమల్లు సంక్రాంతికి కూడా కష్టమే బాసు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ డైరక్టర్ క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా హరి హర వీరమల్లు.శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ లో ఏ.

 Hari Hara Veeramallu Difficult To Release At Pongal , Hari Hara Veeramallu, Kris-TeluguStop.com

ఎం రత్నం ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

సినిమా మొదలై చాలారోజులు అవుతున్నా సినిమా షూటింగ్ మాత్రం అయిపోవట్లేదు.మధ్యలో పవన్ బిజీ అవడం వల్ల చాలా కాలం షూటింగ్ గ్యాప్ వచ్చింది.

ఇక ఈమధ్య మళ్లీ సెట్స్ మీదకు వెళ్తుందని అనుకుంటే స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నట్టు తెలుస్తుంది.ఇప్పటివరకు పూర్తైన సినిమా రష్ చూసిన పవన్ సినిమాపై అసంతృప్తిగా ఉన్నాడని అందుకే కొన్ని రీ షూట్స్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.

అందుకే ఈలోగా మరో సినిమాకు డేట్స్ ఇచ్చేశారట.వినోదయ సీతం సినిమా తెలుగు రీమేక్ లో పవన్ నటించడం దాదాపు కన్ఫర్మ్ అంటున్నారు.ఈ సినిమా కోసం పవర్ స్టార్ 20 రోజుల డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది.ఈ లెక్కన చూస్తే హరి హర వీరమల్లు సినిమా 2023 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేయగా చూస్తుంటే 2023 సంక్రాంతికి కూడా ఆ సినిమా వచ్చేలా లేదని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube