ఆ పాటకి కె.విశ్వనాథ్ డ్యాన్స్ కంపోజ్ చేశారా..?

కళాతపస్వి  కె.విశ్వనాథ్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.

 K Viswanth Composed Swathimutyam Suvvi Suvvi Song Dance Says Kamal Hassan , K.vi-TeluguStop.com

సాగర సంగమం, స్వాతిముత్యం సినిమాలు తెలుగు సినిమాల్లో క్లాసిక్ మూవీస్ గా ఎప్పటికి గుర్తుండిపోతాయి.తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు తనని ఆదరిస్తున్నారని అన్నారు కమల్ హాసన్.

జూన్ 3 శుక్రవారం విక్రం సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేశారు.

యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న విక్రం సినిమాలో కమల్ హాసన్ తో పాటుగా విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిక్ కూడా నటించారు.

ఇక ఈ సినిమాని తెలుగులో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో కమల్ హాసన్ కె.విశ్వనాథ్ తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి చెప్పుకొచ్చారు.స్వాతిముత్యం సినిమాలో సువ్వి సువ్వి పాటకి విశ్వనాథ్ గారే డ్యాన్స్ కంపోజ్ చేశారని.డ్యాన్స్ అంటే ఏంటో తెలియని ఆ పాత్రకి డ్యాన్స్ రాని విశ్వనాథ్ గారు కంపోజ్ చేసిన ఆ స్టెప్పులు బాగా వచ్చాయని అన్నారు.

అలా స్వాతిముత్యం నాటి ఆ విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు కమల్ హాసన్. విశ్వరూపం తర్వాత కమల్ చేసిన విక్రం సినిమా ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గదని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube