బుల్లితెర నటి, వెండితెర ఆర్టిస్ట్ హరితేజ గురించి తెలుగు ప్రేక్షకులకులందరికీ బాగా పరిచయం ఉన్న నటి.యాంకర్, డాన్సర్, యాక్టర్ గా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది హరితేజ.
తొలిసారిగా 2007లో ఆడవారి మాటలకు అర్ధాలే వేరు సినిమాతో వెండితెరకు పరిచయం కాగా.ఆ తర్వాత ఎన్నో అవకాశాలు అందుకుంది.
తన నటనకు తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.
కేవలం వెండి తెరపైనే కాకుండా ఇక 2011లో బుల్లితెరలో మనసు మమత సీరియల్ తో ఎంట్రీ ఇవ్వగా.
ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించి మరింత ఫాలోయింగ్ పెంచుకుంది.అంతేకాకుండా బుల్లితెర లో పలు షోలలో కూడా యాంకరింగ్ చేసింది.ఆ తర్వాత 2017 లో ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీ షో మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది.చివరికి వరకు హౌస్ లో ఉంటూ మూడవ స్థానంలో నిలిచింది.
బిగ్ బాస్ తర్వాత పలు సినిమాలలో కూడా నటించింది హరితేజ.
ఇక ఆమె 2015 లో దీపక్ ను వివాహమాడగా.
తమకు ఒక కూతురు కూడా ఉంది.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే హరితేజ.
తన వ్యక్తిగత విషయాలను, ఫోటోలను బాగా పంచుకుంటుంది.అప్పుడప్పుడు తను జిమ్ లో చేసిన వర్కౌట్ వీడియోలను కూడా పంచుకుంటుంది.
ఇక తన భర్త తో చేసే రీల్స్ కూడా షేర్ చేసుకుంటూ తెగ లైకులు సంపాదించుకుంటుంది.
పైగా తనకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.సమయం దొరికినప్పుడల్లా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతుంది.ఈ మధ్య గ్లామర్ లుక్ తో కూడా దర్శనమిస్తుంది.
పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటూ నెగిటివ్ కామెంట్లు కూడా ఎదుర్కొంటుంది.ఇప్పటికే తను ఒక బిడ్డకు తల్లి.
అయినా తన కుటుంబం కూడా ఎంతో సాంప్రదాయబద్ధంగా కనిపిస్తూ ఉంటుంది.
ఇక అప్పుడప్పుడు బుల్లితెరపై జరిగే ఈవెంట్లలో కూడా పాల్గొని తన పెర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకుంటుంది.
ఇదంతా పక్కన పెడితే తాజాగా హరితేజ తన ఇన్ స్టా లో ఓ స్టోరీ పంచుకుంది.నిజానికి హరితేజ తనకు ఎదురయ్యే సంఘటనలను స్టోరీ రూపంలో బాగా పంచుకుంటూ ఉంటుంది.
అంతే కాకుండా వాటికి తగ్గట్టు ఫోటోలను కూడా పెడుతూ ఉంటుంది.
తాజాగా ఆమె షేర్ చేసుకున్న స్టోరీలో చూసినట్లయితే ఒక వీడియో ఉంది.అందులో తను ఫన్నీగా ఎక్స్ప్రెషన్ ఇవ్వగా ఆమె వేసుకున్న డ్రెస్ చూస్తే మాత్రం మతి పోవాల్సిందే.ఇక ఆమెను ఆ డ్రెస్ లో చూస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు నెటిజన్లు.
ఇక ఆమె లుక్ ను చూసి ప్రతి ఒక్కరు బాగా ట్రోల్స్ చేస్తున్నారు.మీరు ఏంటి ఆ డ్రస్ ఏంటి అని కామెంట్లు పెడుతున్నారు.మరికొందరు దారుణంగా ట్రోల్స్ చేస్తూ తెగ తిట్టిపోస్తున్నారు.