సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని యానిమల్ వీడియోలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి.ముఖ్యంగా పక్షులకు సంబంధించిన వీడియోలు మనల్ని అబ్బురపరుస్తాయి.
తాజాగా అలాంటి ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.ఈ వీడియో లో ఒక చిలుక మాటలు మాట్లాడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.
ఈ చిలుక టాలెంట్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
వైరల్ అవుతున్న వీడియో లో ఒక చిలుక చిన్న మంచంపై వాలి ఉండటం గమనించవచ్చు.
అది అలా మంచం పై కూర్చొని మమ్మీ మమ్మీ అంటూ గట్టిగా అరుస్తూ పాటలు పాడుతూ అల్లరి అల్లరి చేస్తోంది.చిన్నపిల్లలు తన తల్లిని ఎలా పిలుస్తారో అలా ఈ పక్షి పిలుస్తూ ఆశ్చర్యపరిచింది.
అయితే చిలుక పిలుస్తుంటే దానిని పెంచుతున్న మహిళ ఆయేగా బేటా, వస్తున్న వస్తున్నా అంటూ సమాధానం ఇస్తూ ఉంది.రెండు నిమిషాలకు పైగా ఈ చిలుక ఆ మహిళతో మాట్లాడింది.
అయితే మాటలు నేర్చిన చిలుకలు సాధారణంగా విన్న మాటలనే యధాతధంగా అంటుంటాయి కానీ ఇది మనుషులతో మాట్లాడటం కూడా నేర్చుకుంది.
సాధారణంగా చిలుకలను అందమైన, అత్యంత మేధోపరమైన పక్షులుగా పరిగణిస్తారు.ఇవి మానవులు చెప్పే ఎంత పెద్ద మాటలనైనా సులువుగా రిపీట్ చేయగలవు.ఈ ప్రత్యేకమైన ప్రతిభ కారణంగానే భారత్ లోని అనేక కుటుంబాలు ఈ చిలుకలను పెంపుడు జంతువులుగా పెంచుతున్నారు.
కబుర్లు చెప్పే లోరీ జాతి చిలుకలకు బాగా డిమాండ్ ఉంటుంది.ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.కొద్ది రోజుల్లోనే, ఈ వీడియో 49.8 వేలకు పైగా వీక్షణలు, వేలకొద్దీ లైక్‌లను వచ్చాయి.ఈ అద్భుతమైన వీడియో ని మీరు కూడా వీక్షించండి.