ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో దూసుకెళ్తున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన.అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.పైగా ఇండియన్ క్రష్ గా కూడా పేరు సొంతం చేసుకుంది.ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో ఈ అమ్మడు రేంజ్ హై లో ఉంది.తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి 2016లో కన్నడ సినిమా కిరాక్ పార్టీ తో పరిచయమైంది.
ఆ తర్వాత ఛలో సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఇక ఈ సినిమాతో తొలి నటనతో బాగానే మెప్పించింది.
ఆ తర్వాత అదే ఏడాది గీత గోవిందం సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.ఇక అలా పలు సినిమాలలో అవకాశాలు అందుకోగా అందులో సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పొగరు సినిమాలతో మంచి సక్సెస్ అందుకుంది.
ఇక ఇటీవలే పాన్ ఇండియా మూవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి హిట్ సంపాదించుకుంది.ప్రస్తుతం పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అందులో కొన్ని విషయాలు పంచుకుంది.తను స్కూల్ డేస్ నుంచి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ని ఇష్టపడేదట.
ఆయన తన అభిమాన హీరో అని.ఆయన సింప్లిసిటీ తనను బాగా ఎట్రాక్ట్ చేసిందని తెలిపింది.అంతేకాకుండా ఆయనతో కలిసి నటించే అవకాశం రాగానే తన ఆనందానికి అవధులు లేవు అని.ఫస్ట్ డే షూటింగ్ కోసం బాగా ఎదురు చూశానని తెలిపింది.అంతేకాకుండా ఆ రోజు క్లాప్ కొట్టిన తర్వాత ఆయనకు దిష్టితీసి ఆయన పట్ల తనకున్న అభిమానాన్ని చూపించానని తెలిపింది.

దిష్టి తీయటం తో ఆయన షాక్ అయ్యారు.సెట్ లో ఉన్న వాళ్ళందరూ నవ్వుకున్నారని అన్నది.మొత్తానికి విజయ్ తో ఉన్న తన ఫస్ట్ లవ్ ని బయట పెట్టింది.
ఇక ఆమె చేసిన కామెంట్లు నెట్టింట్లో వైరల్ గా మారాయి.ప్రస్తుతం ఆమె వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ దళపతి తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.

బాగా వర్కౌట్లు చేస్తూ వాటికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేసుకుంటుంది.తన పెట్స్ తో దిగిన ఫోటోలను కూడా పంచుకుంటుంది.ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.అప్పుడప్పుడు తన అభిమానులతో సరదాగా లైవ్ లోకి వచ్చి ముచ్చట్లు పెడుతుంది.కొన్ని కొన్ని సార్లు తనకు సంబంధించిన ఏదైనా ప్రశ్నలు వేయమని అభిమానులను అడుగుతుంది.అలా అభిమానులు దొరికిందే ఛాన్స్ అంటే తెగ ప్రశ్నలు వేస్తూ ఉంటారు.
అడగరాని ప్రశ్నలు కూడా వేస్తూ ఉంటారు.