వచ్చే ఏడాది తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలను ఎదుర్కొనేందుకు బీజేపీ పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.అన్నారు.అధికార పార్టీ టిఆర్ఎస్ను ఓడించి .2023 ఎన్నికల్లో బీజేపీ పార్టీని విజయవంతం చేయాలని ఓటర్లకు కోరుతున్నారు బీజేపీ శ్రేణులు.గత రెండేళ్లలో జరిగిన రెండు అసెంబ్లీ ఉపఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఎన్నికలలో పార్టీ విజయం సాధించిన సీనియర్ బిజెపి నాయకుడు, వచ్చే ఏడాది హస్టింగ్లలో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేసి ఓటర్లను కోరుతున్నారు బీజేపీ నేతలు.
ప్రజా సంక్షమం కోసమే బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రని స్పష్టం చేశారు అమిత్ షా.కేసీఆర్ను గద్దె దించేందుకైతే… తాను రావలసిన అవసరం లేదని బండి సంజయ్ ఒక్కడు చాలన్నారు.రాష్ట్రంలో కేసీఆర్ ను గద్దె దించాలా… వద్దా చెప్పాలంటూ ప్రజలను అడిగారు.
నీళ్లు, నిధులు, నియామకాలంటూ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏం చేశారంటూ ప్రశ్నించారు.
కేసీఆర్ తుగ్లక్ నిర్ణయాలతో తెలంగాణ ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆరోపించారు.ప్రజా సంగ్రామ యాత్రలో ఎక్కడికి వెళ్లినా ప్రజల వెతలే కళ్లకు కట్టాయన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను లూటీ చేస్తోందని… పంచభూతాలను సైతం టీఆర్ఎస్ ప్రభుత్వం దిగమింగుతోందని ఆరోపించారు.
రాష్ట్ర మంత్రివర్గంలో కీలక శాఖలన్నీ కేసీఆర్ కుటుంబానివేనని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజలు బీజేపీకి ఒక్క అకాశం ఇవ్వాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రం ఎవరి జాగీరు కాదని… అమరుల బలిదానాలతోనే తెలంగాణ వచ్చిందన్నారు.రాష్ట్రంలో కల్వకుట్లం కుటుంబానికి ఎంతు హక్కు ఉందో… మిగతా ప్రజలకూ అంతే హక్కు ఉంటుందని తేల్చిచెప్పారు.తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పలు సంక్షేమ పథకాలకు నిధులను కేంద్రమే అందజేస్తుందని స్పష్టం చేశారు.అయినా… కేంద్రం నిధులు ఇవ్వడంలేదంటూ… కేంద్రంపై టీఆర్ఎస్ నేతలు విష ప్రచారం చేస్తుందన్నారు.దళిత బంధు, రైతులకు ఉచితంగా ఎరువులు ఏమయ్యాయని ప్రశ్నించారు.