'సర్కారు' సహా తొలిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్ సినిమాలు ఇవే!

టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయితే ఆ సందడే వేరు.సినిమా రిలీజ్ అయితే బాక్సాఫీస్ దగ్గర సందడి వేరుగా ఉంటుంది.

 Tollywood Top 10 Highest Share Movies On Day 1 Sarkaru Vari Paata Rrr Bahubali P-TeluguStop.com

తాజాగా మహేష్ బాబు సర్కారు వారి పాట విషయంలో ఇలానే జరిగింది.ఈ సినిమా నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి మొదటి రోజు కలెక్షన్ల మోత మోగించింది.మరి మన టాలీవుడ్ లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

ఆర్ఆర్ఆర్ :

రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నటించారు.ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర 135 కోట్ల షేర్ రాబట్టి అన్ని రికార్డులను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ లో నిలిచింది.

బాహుబలి 2 :

ఈ సినిమా ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కింది.ఇది ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే 123 కోట్ల షేర్ రాబట్టింది.

సాహో :

బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన సాహో మొదటి రోజు 73.64 కోట్లు షేర్ వసూలు చేసింది.ప్రపంచ వ్యాప్తంగా 73.64 కోట్ల షేర్ రాబట్టింది.

Telugu Agnathavaasi, Bahubali, Pushpa, Radhe Shyam, Sahoo, Tollywood, Top Share,

సైరా నరసింహారెడ్డి :

చిరంజీవి హీరోగా వచ్చిన ఈ సినిమా మొదటి రోజు 38.75 కోట్ల షేర్ రాబట్టి టాప్ ప్లేస్ లో చోటు సంపాదించు కుంది. ప్రపంచ వ్యాప్తంగా 53.72 కోట్ల షేర్ రాబట్టింది.

బాహుబలి :

ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 22.4 కోట్ల కలెక్షన్స్ సాధించింది.ప్రపంచ వ్యాప్తంగా 46 కోట్ల షేర్ రాబట్టింది.

సర్కారు వారి పాట :

మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్సక్వములో తెరకెక్కిన ఈ సినిమా నిన్న భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది.ఈ సినిమా 36.01 కోట్ల షేర్ రాబట్టి ఐదవ స్థానంలో నిలిచింది.

Telugu Agnathavaasi, Bahubali, Pushpa, Radhe Shyam, Sahoo, Tollywood, Top Share,

సరిలేరు నీకెవ్వరూ :

ఈ సినిమా మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కింది.ఈ సినిమాకు మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 32.77 కోట్లు వసూళ్లు రాబట్టగా వరల్డ్ వైడ్ గా 43.16 కోట్ల షేర్ రాబట్టింది.

రాధేశ్యామ్ :

భారీ అంచనాలతో రిలీజ్ అయినా ఈ సినిమా తొలిరోజు 25.50 కోట్ల షేర్ సాధించింది.ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్ల షేర్ వసూళ్లు చేసింది.

అయినా కూడా ఈ సినిమా బయట పడలేక నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది.

Telugu Agnathavaasi, Bahubali, Pushpa, Radhe Shyam, Sahoo, Tollywood, Top Share,

అజ్ఞాతవాసి :

పవన్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా మొదటిరోజు 26.40 కోట్ల షేర్ సాధించింది.ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 39.30 కోట్ల షేర్ వసూళ్లు సాధించింది.

పుష్ప :

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 24.90 వసూళ్లు చేసింది.ఇక వరల్డ్ వైడ్ గా 38.49 కోట్ల షేర్ రాబట్టింది.ఇలా టాప్ టెన్ లో ఉన్న సినిమాలు ఇవే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube