మహేష్‌, కీర్తి సురేష్‌ ల 'సర్కారు వారి పాట' ప్రివ్యూ

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా కోసం దాదాపు ఏడాది కాలంగా అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.

 Mahesh Babu Sarkaru Vaari Paata Movie Preview Mahesh Babu , Sarkaru Vaari Paata-TeluguStop.com

ఇక మహేష్ బాబు గత చిత్రం సరి లేరు నీకు ఎవ్వరు విడుదల అయ్యి ఏకంగా రెండున్నర సంవత్సరాలు అవుతుంది.కరోనా వల్ల చాలా గ్యాప్‌ రావడంతో అభిమానులు ఆవురావురుమంటూ ఉన్నారు.

ఇక ఆగేది లేదు అన్నట్లుగా మహేష్‌ బాబు మాస్ డైలాగ్స్ తో రంగంలోకి దిగబోతున్నాడు అని ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతోంది.సినిమా లో మహేష్‌ బాబు మరియు కీర్తి సురేష్ ల కాంబో సన్నివేశాలు మరియు అద్బుతమైన మాస్ డైలాగ్స్ తో సినిమా ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

హీరోగా మహేష్‌ బాబు జోరు చూస్తుంటే మరో విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనిపిస్తుంది.

సర్కారు వారి పాట సినిమా కథ విషయానికి వస్తే బ్యాంకింగ్‌ రంగంలో ఉన్న లోపాలను మరియు లోటు పాట్లకు సంబంధించిన విషయాలను ఈ సినిమాలో చూపించినట్లుగా తెలుస్తోంది.

సినిమా లో మహేష్ బాబు లుక్ మరియు పాటలు కుమ్మేస్తాయి అన్నట్లుగా ఉన్నాయి.మహేష్ బాబు మరియు కీర్తి సురేష్ ల మమ మహేష పాట మాస్ ఆడియన్స్ కు రేపు థియేటర్ లో పిచ్చెక్కించడం ఖాయం అంటున్నారు.

 మహేష్ బాబు సినీ కెరీర్లో ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయం గా నిలుస్తోంది అంటూ అభిమానులు ధీమా తో ఉన్నారు.  ఈ సినిమా మహేష్ బాబు కి మరియు ఆయన అభిమానులకు కచ్చితంగా ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఉంటుందని.

భారీ విజయాన్ని సాధిస్తుంది అని దర్శకుడు పరుశురాం నమ్మకంగా వ్యాఖ్యలు చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube