ఈ చేప ఏంటి గ్రహాంతరవాసిలా ఉంది.. దీని వింత ఆకృతిని చూస్తే షాకే..!

సముద్రంలో మనకు తెలియని ఎన్నో వింత జీవులు దాగి ఉంటాయి.ఇవి అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూ మనల్ని ఆశ్చర్య పరుస్తుంటాయి.

 What An Alien This Fish Is Shocking To See Its Strange Shape , Fish, Varitey,-TeluguStop.com

అయితే తాజాగా ఒక అరుదైన కప్ప చేప లేదా ఫ్రాగ్ ఫిష్ కెమెరా కంటికి చిక్కింది.దీనికి సంబంధించిన వీడియోని ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ డిస్కవరీ షేర్ చేసింది.

దీనికి ఇప్పటికే పది లక్షలకు పైగా వ్యూస్, లక్ష వరకు లైక్ లు వచ్చాయి.ప్రపంచంలోని అన్ని సముద్రాల్లో సుమారుగా 46 రకాల కప్ప చేపలు ఉన్నాయి.అంటే ఈ జాతుల సంఖ్య తక్కువో అర్థం చేసుకోవచ్చు.

46 రకాల్లోని ప్రతి కప్ప చేప చాలా ప్రత్యేకంగా, అందంగా ఉంటుంది.వాటిలో ఒకటైన హెయిరీ ఫ్రాగ్ ఫిష్‌ని డిస్కవరీ అందరికీ పరిచయం చేసింది.ఈ ఫిష్‌కు అనేక విచిత్రమైన లక్షణాలు ఉన్నాయి.ఈ ఫిష్‌కు శరీరానికి బయట ఒక అంటుకునే ఎస్కా ఉంటుంది.ఇది చేప శరీరానికి అతుక్కున్న వేరే జీవి లాగా కనిపిస్తుంది కానీ ఈ భాగం దానిలోనేదే! ఈ ప్రత్యేకమైన అదనపు పొడవాటి వెన్నెముక ఒక పురుగు లాగా అటూ ఇటూ కదులుతూ ఉంటుంది.

దాన్ని చూసి తినేందుకు ఇతర చేపలు వచ్చి ఈ ఫ్రాగ్ ఫిష్ నోటికి చిక్కుతాయి.ఇలా తన ప్రత్యేకమైన బాడీ పార్ట్ ను ఎరగా ఉపయోగించి ఇతర చేపలను ఆకర్షిస్తుంది.

ఈ ఎస్కా పార్ట్ వద్దకు ఇతర చేపలు రాగానే అది దానిని నోరును సాధారణ పరిమాణం కంటే 12 రెట్లు విస్తరించగలదు! గాయపడినా లేదా పోయినా కూడా ఎస్కా మళ్లీ చక్కగా తయారవుతుంది.

ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా పసుపు రంగు వెంట్రుకల వంటి భాగాలు వాస్తవానికి చేప చర్మం.

ఇది సముద్రపు అడుగుభాగం లేదా పగడపు దిబ్బలను పోలి ఉంటుంది.దీనివల్ల శత్రువుల నుంచి తప్పించుకోవడం సాధ్యం అవుతుంది.

అలాగే ఎరలను పట్టుకోవడం సులభమవుతుంది.ఈ చేపలు రంగును మార్చగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉన్నాయి! ఈ వీడియోని చూసి చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

దీని ఆకృతి మరింత భయంకరంగా ఉందని, దీన్ని చూడగానే తాను షాక్ అయినట్లు ఒక యూజర్ కామెంట్ చేశాడు.ఈ వండర్‌ఫుల్‌ నేచురల్ వీడియో ని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube