యాదాద్రి జిల్లా:అధికారుల కళ్లుగప్పి అక్రమ నిర్మాణాలకు తావిస్తున్న వైనం బీబీనగర్ పట్టణంలో చోటుచేసుకుంది.ఇదే విషయంపై భువనగిరి జిల్లా కలెక్టర్ ఆఫీసులో గల జిల్లా పంచాయతీరాజ్ అధికారినిని కలిసి తన ప్లాట్లను కబ్జా చేసి,అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని,భువనగిరి 14 వ వార్డు కాలనీకి చెందిన మండువ శ్రీశైలం అధికారులకు ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళితే బీబీనగర్ పట్టణం హైవే రోడ్డులో గల 596 సర్వేనెంబర్ లో తనపేరున, తన భార్య సత్యలక్ష్మి పేర్లతో 610 గజాల ఇంటి స్థలాన్ని హైదరాబాద్ నివాసి అయిన అమీరున్నిసా బేగం వద్ద కొనుగోలు చేసి భువనగిరి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకుని మరుసటి సంవత్సరం బీబీనగర్ గ్రామపంచాయతీలో అనుమతి పొందానన్నారు.అదే సంవత్సరంలో మా నాన్న మృతి చెందడంతో ఇంటి నిర్మాణం చేపట్టలేక పోయానని ఆయన వాపోయారు.
ఆరు నెలల తర్వాత స్థానికంగా ఉండే పంజాల రామాంజనేయులు గౌడ్, మాజీ పట్వారి మీసాల బసవయ్య,రౌడీషీటర్ గొలనుకొండ ముత్యాలు ముగ్గురు కలిసి తమ పక్కన ప్లాటు కొనుగోలు చేశారని,వారి ప్లాట్లు హైవే రోడ్డులో పోవడంతో ప్రభుత్వం నుండి వచ్చే నష్టపరిహారం తీసుకుని,నా ఫ్లాట్ ను ఆక్రమించడంతో తాను కోర్టును ఆశ్రయించానన్నారు.కోర్టు వారికి జూనియర్, సీనియర్ కోర్టులలో జడ్జిమెంట్ వారికి రావడంతో తాను హైకోర్టులో కేసు వేశానని,ఇరువురి ప్లాట్లు కొనుగోలు చేసిన పట్టాదారులు వేరే వారు కాబట్టి డిక్లరేషన్ షూట్ వేసుకోవాలని,తనకు హైకోర్టు సూచించినట్లు పేర్కొన్నారు.
తాను భువనగిరి కోర్టులో 166 బై 2016లో దావా వేశానని కోర్టులో కేసు నడుస్తోందని,అనంతరం తనకు హైకోర్టు ఆర్డర్ 19630 బై 2021లో ఆర్డర్ వచ్చిందని,గతంలో గ్రామపంచాయతీ ఇచ్చిన పర్మిషన్ ప్రకారం రెన్యువల్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.ఇదే విషయాన్ని గ్రామపంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పర్మిషన్ కోసం మరోసారి దరఖాస్తు చేశానన్నారు.
గ్రామపంచాయతీ అధికారులు తనకు కుంటిసాకులు చెబుతూ దానిని రిజెక్ట్ చేసి, ఎలాంటి పర్మిషన్ లేని స్థానికుడైన రియల్టర్ రామాంజనేయులు గౌడ్,మాజీ పట్వారి మీసాల బసవయ్య,రౌడీ షీటర్లు గొలనుకొండ ముత్యాలు కలిసి తన ప్లాట్లు ఆక్రమించి,అక్రమ మడిగల నిర్మాణం చేపట్టడంతో నేను ఎందుకు చేపడుతున్నారని అడగడంతో తనపై చేయి వేసుకున్నారని,తాను వెంటనే బీబీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశానని వారిపై కేసు నమోదు చేశారని వారన్నారు.పోలీసులు ఇరు వర్గాలను పిలిచి కోర్టులో జడ్జిమెంట్ వచ్చేవరకూ ఎవరు కూడా నిర్మాణాలు చేపట్టవద్దని సూచించినట్లు ఆయన తెలిపారు.
అనంతరం ఇటీవల పంజాల రామాంజనేయులు గౌడ్ ఇతరులు కలిసి అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో తాను బీబీనగర్ సెక్రెటరీనీ, ఎంపీఓను,ఎండిఓ లను ఆర్టీఐ సమాచారం మేరకు తాను రామాంజనేయులు గౌడ్ ఇతరులకు ఏమైనా పర్మిషన్ ఇచ్చారా అని ఆరుసార్లు గత ఆరు నెలలుగా అడగడంతో అందుకు వారు అతనికి ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని,ఇంటి మీటర్ కూడా ఇచ్చిన దరఖాస్తును రిజెక్ట్ చేయమని,బోర్ కూడా సీజ్ చేయాలని రెవెన్యూ అధికారులకు లెటర్ వ్రాసినట్లు,అక్రమ నిర్మాణాలను ఎప్పుడు తొలగిస్తారని అడగడంతో అందుకు వారు పై అధికారుల ఆదేశాల మేరకు కూల్చివేస్తామని,ఆరుసార్లు తమకు వివరణ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.ఈ మేరకు గురువారం జిల్లా పంచాయతీ అధికారి కలిసి వినతిపత్రం అందజేయడంతో ఆమె అందుకు తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నట్లు ఆయన వివరించారు.