సమంత పోస్ట్ కు లవ్ యూ టూ అంటూ కామెంట్ పెట్టిన ప్రీతమ్.. అసలేం జరిగిందంటే?

స్టార్ హీరోయిన్ సమంత ఏడు నెలల క్రితం నాగచైతన్యతో విడిపోయిన సంగతి తెలిసిందే.చైతన్య సమంత విడిపోవడానికి వేర్వేరు కారణాలు ప్రచారంలోకి రాగా ఆ కారణాలలో ప్రీతమ్ జుకల్కర్ కూడా ఒకరని ప్రచారం జరిగింది.

 Preetham Jukalker Comment To Samantha Post Goes Viral In Social Media Details, S-TeluguStop.com

అయితే ప్రీతమ్ మాత్రం తన గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా స్పందించి క్లారిటీ ఇచ్చారు.అయితే సమంత, నయనతార హీరోయిన్లుగా విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో తెరకెక్కిన కాతువాక్కుల రెండు కాదల్ గత వారం విడుదలైన సంగతి తెలిసిందే.

తెలుగులో ఈ సినిమా సక్సెస్ సాధించకపోయినా తమిళంలో మాత్రం ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడం గమనార్హం.ఈ సినిమాలో సమంత ఖతీజా అనే పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు.

ఈ సినిమా గురించి సమంత ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ ఖతీజా పాత్రలో అద్భుతంగా నటించే ఛాన్స్ ఇచ్చినందుకు విఘ్నేష్ శివన్ కు కృతజ్ఞతలు తెలిపారు.కామెడీ జానర్ సినిమాలు అంటే తనకు ఇష్టమని సమంత తెలిపారు.

ఈ సినిమాలో నటించడంతో తన కోరిక తీరిందని సమంత కామెంట్లు చేశారు.

ఆ తర్వాత సమంత ప్రీతమ్ జుకల్కర్ తో పాటు మరి కొందరిని ట్యాగ్ చేస్తూ లవ్ సింబల్స్ పెట్టారు.సమంత ట్యాగ్ చేయడంతో ప్రీతమ్ జుకల్కర్ లవ్ యూ టూ జీజీ అని రిప్లై ఇచ్చారు.అయితే ప్రీతమ్ చేసిన కామెంట్ కు నెటిజన్లు తమదైన శైలిలో రియాక్షన్ ఇచ్చారు.

సమంత గురించి ఈ కామెంట్ల వల్ల మరోసారి చర్చ జరుగుతోంది.

సమంత ప్రస్తుతం శాకుంతలం, యశోద సినిమాలలో నటిస్తున్నారు.శాకుంతలం రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రావాల్సి ఉండగా యశోద సినిమా మాత్రం ఆగష్టులో రిలీజ్ కానుంది.ఈ రెండు సినిమాలతో సమంత కోరుకున్న విజయాలు దక్కుతాయో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube