ఈ నెల 14వ తేదీన 10,000కు పైగా స్క్రీన్లలో విడుదలైన కేజీఎఫ్2 సినిమా ఇప్పటికే 473 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.280 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బడ్జెట్ కు రెట్టింపు కలెక్షన్లను సాధించే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.అయితే కేజీఎఫ్2 సినిమా ఖాతాలో అరుదైన రికార్డులు చేరుతున్నాయి.ఒకేరోజు కేజీఎఫ్2 మూడు సినిమాలను దాటేయడం గమనార్హం.
కేజీఎఫ్2 హిందీ వెర్షన్ గ్రాస్ కలెక్షన్లు 343.13 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.బుధవారం రోజున ఈ సినిమా 6 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకోగా హిందీలో బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన సంజు, పీకే, టైగర్ జిందా హై సినిమాల కలెక్షన్ల రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేసింది.బాలీవుడ్ ఇండస్ట్రీలో రాకీభాయ్ హవా కొనసాగుతోంది.
అయితే రేపటినుంచి ఈ సినిమా కలెక్షన్లు తగ్గే ఛాన్స్ ఉంది.
దంగల్, బాహుబలి2 ఈ సినిమా కంటే ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాలు కాగా ఫుల్ రన్ లో కేజీఎఫ్2 దంగల్ రికార్డును బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి.కేజీఎఫ్1 సరైన ప్రమోషన్స్ లేకపోవడం వల్ల హిందీలో భారీస్థాయిలో కలెక్షన్లను సాధించలేదు.అయితే ఆ సినిమా సక్సెస్ కేజీఎఫ్2 సినిమాకు ఉపయోగపడింది.
కేజీఎఫ్2 తొలిరోజు నుంచి హిందీలో అంచనాలకు మించి కలెక్షన్లను సాధిస్తోంది.మదర్ సెంటిమెంట్ సన్నివేశాలు, ఎలివేషన్ సీన్లు ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లను సొంతం చేసుకోవడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమయ్యాయి.అటు యశ్ అభిమానులు ఇటు ప్రశాంత్ నీల్ అభిమానులు ఈ రికార్డుల విషయంలో పూర్తిస్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేస్తుండటం గమనార్హం.కేజీఎఫ్2 సక్సెస్ తో ప్రశాంత్ నీల్, యశ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ లపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.