అమెరికన్ వ్యాపారవేత్త పెద్దమనసు.. ఉక్రెయిన్ ఆర్మీ, పౌరుల కోసం బుల్లెట్ ప్రూఫ్ దుస్తులు

రష్యా దండయాత్రతో ఉక్రెయిన్ అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే.ఎక్కడ చూసినా మరణించిన సైనికులు, ధ్వంసమైన సైనిక వాహనాలు, తెగిపడిన శరీర భాగాలు, శిథిల భవనాలతో ఉక్రెయిన్ స్మశానాన్ని తలపిస్తోంది.

 New York Charity Sends Ukrainian Soldiers, Civilians Bulletproof Vests , Ukraine-TeluguStop.com

ప్రాణభయంతో పిల్లా పాపలను చేతబుచ్చుకుని కట్టుబట్టలతో ఐరోపా దేశాలకు వలస వెళ్తున్నారు ఉక్రెయిన్ వాసులు.ఇదే సమయంలో ఉక్రెయిన్‌కు మానవతా సాయాన్ని అందజేస్తోంది అంతర్జాతీయ సమాజం.

మందులు, ఆహారం, బట్టలు, ఇతర అత్యవసర వస్తువులను ఆయా దేశాలు పంపుతున్నాయి.పలు స్వచ్చంద సంస్థలు, దాతలు కూడా ఉక్రెయిన్‌కు సాయం చేస్తున్నారు.

తాజాగా అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన వ్యాపారవేత్త లిడియా డొమినిక్ ఉక్రేనియన్ సైనికులకు, ఆ దేశ పౌరులను రక్షించేందుకు తన స్వచ్ఛంద సంస్థ ‘‘బఫెలో గివ్స్’’ ద్వారా బుల్లెట్ ప్రూఫ్ దుస్తులు సేకరిస్తున్నారు.ఫిబ్రవరిలో రష్యన్ దళాలు ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుంచి డొమినిక్ ఉక్రెయిన్‌కి సాయం చేస్తూనే వున్నారు.

తన వ్యాపార సంస్థ బఫెలో బెలూన్ .కో ద్వారా ఉక్రేనియన్ శరణార్ధుల కోసం విరాళాలు సేకరిస్తున్నారు.

ఆమె పిలుపునకు స్పందించి.డైపర్‌లు, ఫార్ములా, వైద్య సామాగ్రి, సాక్స్, టోపీలు, చేతి తొడుగులు, ఆహారం, దుప్పట్లు, హైజిన్ ప్రొడక్ట్స్‌ వెల్లువలా వచ్చాయి.నాలుగు రోజుల్లోనే 21 ప్యాలెట్లను యూరప్‌కు రవాణా చేశారు.అయితే ఇక మీదట డైపర్లు, దుస్తులు కాదని.

బుల్లెట్ ప్రూఫ్ దుస్తులు పంపాలని డొమినిక్ పిలుపునిచ్చారు.ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సోషల్ మీడియా ద్వారా ఆమె తన మనసులోని మాటను తెలియజేశారు.

అయితే డొమినిక్ ప్రయత్నాలు అక్కడితో ఆగలేదు.తోటి వారికి సాయం చేయాలనే ఉత్సాహంతో ఆమె తన సొంత నిధులతోనూ జాకెట్స్ కొనడం ప్రారంభించింది.

Telugu Buffalo, European, Lydia Dominic, Yorkcharity, York America, Ukraine-Telu

అదే సమయంలో దేశంలోని వివిధ ఆయుధాల డీలర్‌లతో డొమినిక్ సంప్రదింపులు ప్రారంభించారు.ఈ సందర్భంగా అంతర్జాతీయ ట్రాఫిక్ ఇన్ ఆర్మ్స్ రెగ్యులేషన్స్ లైసెన్స్ పొందడానికి ఒక మార్గాన్ని కనుగొంది.తద్వారా ఆమె బుల్లెట్ ప్రూఫ్‌ జాకెట్లను చట్టబద్ధంగా యూరప్‌కు రవాణా చేయగలదు.ఈ జాకెట్లను డొమినిక్ , ఆమె బృందం వ్యక్తిగతంగా వార్సా, పోలాండ్, ఉక్రెయిన్‌లోని ఎల్వివ్‌లోని గిడ్డంగులకు అందించి వాటిని సకాలంలో అవసరమైన వ్యక్తులకు చేరవేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube