పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రాజకీయాల పరంగా సంచలనగా మారారు.ఈయన నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇకపోతే జనసేన పార్టీ(Janasena Party)ని స్థాపించి రాజకీయాలలోకి అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఎన్ని రోజులు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న, ఇప్పుడు మాత్రం సంచలనమైన విజయాన్ని సొంతం చేసుకొని దేశవ్యాప్తంగా వార్తలలో నిలిచారు.ఇకపోతే పవన్ కళ్యాణ్ వృత్తి పరమైన జీవితం పక్కన పెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన ఇప్పటికీ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు.
ఈ విషయంపై ఎంతో మంది ఈయనని ట్రోల్స్ కూడా చేస్తుంటారు.
ఇక పవన్ కళ్యాణ్ ఇలా మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణం లేకపోలేదు.ఈయన సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు సత్యానంద యాక్టింగ్ స్కూల్లో ఉన్న సమయంలోనే నందిని(Nandini ) అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది.అయితే ఈమెతో కుటుంబ సభ్యుల సమక్షంలోని వివాహం జరిగింది పెళ్లయిన తర్వాత కొద్ది రోజులకే ఇద్దరు మధ్య మనస్పర్ధలు వచ్చిన నేపథ్యంలో వీరి వ్యవహారం కోర్టు వరకు వెళ్లినది.
నందిని lకి విడాకులు ఇవ్వకుండానే రేణు దేశాయ్ (Renu Desai) తో రిలేషన్ లో ఉన్నారు.ఈ విషయంపై నందిని కోర్టును ఆశ్రయించి 2008వ సంవత్సరంలో విడాకులు తీసుకుని విడిపోయారు.
ఈ విధంగా విడాకులు తీసుకొని విడిపోయిన పవన్ కళ్యాణ్ భరణం కింద ఆమెతో ఐదు కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారని తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ తో విడాకులు తర్వాత ఇతర దేశాలలో స్థిరపడ్డారని తెలుస్తోంది.ఇక ఈమెకు విడాకులు ఇచ్చిన అనంతరం రేణు దేశాయ్ అని పెళ్లి చేసుకున్నారు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత రేణు దేశాయ్ కి కూడా పవన్ విడాకులు ఇచ్చారు.ప్రస్తుతం ఈయన రష్యన్ మోడల్ అన్నా లెజినోవాను వివాహం చేసుకున్నారు.