సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న నటి దిశా పటాని(Disha patani) త్వరలోనే కల్కి సినిమా (Kalki Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమాలో ఈమె ఓ చిన్న పాత్రలో నటించబోతున్నారు.
ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ వీడియోలో కూడా ఈమె కనిపించే సందడి చేశారు.ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ఈమె కూడా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.
జూన్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా దిశా పటాని మాట్లాడుతూ.కల్కి మొదటి రోజు షూటింగ్ సన్నివేశాలను గుర్తు చేసుకున్నారు.కల్కి మొదటి రోజు సినిమా షూటింగ్లో భాగంగా ప్రభాస్ టీమ్ మొత్తానికి తన ఇంటి నుంచి ఫుడ్ తీసుకోవచ్చారని ఈమె తెలియజేశారు.
ఆయన చాలా స్వీట్ పర్సన్ తనతో షూటింగ్ అంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటుందని ఈమె తెలిపారు.
నేను ఇప్పటివరకు పనిచేసిన మంచి నటీనటులలో ప్రభాస్ ఒకరు.అతను చాలా వినయ పూర్వకంగా, మర్యాదగా ఉంటాడు అంటూ ప్రభాస్ మంచితనం గురించి ఆయనపై ప్రశంసల కురిపిస్తూ దిశా పటానీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక కల్కి సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనే (Deepika Padukone)నటించారు.
ఇక ఈ సినిమాలో కమల్ హాసన్(Kamal Hassan) అమితాబ్(Amithab ) వంటి వారు కీలక పాత్రలలో నటించారు ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.ఇక ఈ సినిమాకు దర్శకుడుగా నాగ్ అశ్విని వ్యవహరించిన సంగతి తెలిసిందే.