చంద్రబాబు సీఎం : పట్టాభిషేకానికి సిద్ధమవుతున్న అమరావతి

ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి( TDP, Janasena, BJP ) కూటమి భారీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి .రేపు ఉదయం 9.27 కు ఏపీ ముఖ్యమంత్రిగా టిడిపి అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో అమరావతి లో సందడి వాతావరణం మొదలైంది.

 Amaravati Is Preparing For The Coronation Of Chandrababu Cm, Tdp, Ysrcp, Telugud-TeluguStop.com

ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి అమరావతి ప్రాంతంలో రోడ్లు, విధులను అధికారులు శుభ్రం చేస్తుండడంతో అమరావతిలో కొత్త కళ కనిపిస్తోంది .రేపు చంద్రబాబు ప్రమాణస్వీకారం సందర్భంగా అమరావతి ప్రాంతాలు సుందరంగా ముస్తాబవుతున్నాయి.ఇక సీఎంగా బాధ్యతలు చేపట్టకు ముందే చంద్రబాబు ( Chandrababu )అధికారులతో టచ్ లో ఉంటూ, అమరావతి లో క్లీనింగ్ పనులు వేగవంతం చేసే విధంగా చర్యలు చేపట్టారు.

Telugu Chandrababu, Lokesh, Telugudesam, Ysrcp-Politics

కీలక శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ తగిన ఆదేశాలు ఇస్తున్నారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ( AP Governor Abdul Nazir )చంద్రబాబుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు.టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు( Achchenna Naidu ) ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

సీనియర్ ఐఏఎస్ అధికారులు ఐదుగురు ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి.చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాన నరేంద్ర మోది తో పాటు , వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకాబోతూ ఉండడం తో భారీగా భద్రత ఏర్పాట్లు చేపట్టారు.

ఇప్పటికే అమరావతి పరిసర ప్రాంతాల్లో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో సంబరాలు మొదలయ్యాయి.

Telugu Chandrababu, Lokesh, Telugudesam, Ysrcp-Politics

ఇంటింటికి స్వీట్ బాక్స్ లు పంచుతూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.2014లో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వత అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించారు .దశలవారీగా అక్కడ అభివృద్ధి పనులు చేపట్టారు .2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో అమరావతిలో అన్ని పనులు నిలిచిపోయాయి.మూడు రాజధానుల పేరుతో వైసిపి ప్రభుత్వం హడావుడి చేయడంతో అమరావతి రాజధాని ప్రతిపాదన వెనక్కి వెళ్ళింది.

అప్పటి నుంచి అమరావతిని ఏపీ రాజధానిగా కొనసాగించాలని టిడిపి అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతూనే వచ్చాయి .ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించబోతుండడంతో అమరావతిలో సందడి మొదలైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube