మేకప్ కోసం  3 గంటలు... కమల్ హాసన్ డెడికేషన్ కి ఫిదా కావాల్సిందే!

సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు సీనియర్ నటుడు కమల్ హాసన్ (Kamal Hassan)!ఈయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కమల్ హాసన్ ఏదైనా ఒక పాత్రకు కమిట్ అయ్యారు అంటే 100% ఆ పాత్రకు న్యాయం చేస్తారని చెప్పాలి.

 Kamal Hassan Kalki Look Goes Viral , Kamal Hassan, Kalki, Prabhas, Make Up-TeluguStop.com

ఇలా ఇప్పటికే ఎన్నో వైవిద్య భరితమైన పాత్రలలో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న కమల్ హాసన్ ఎప్పుడు కూడా ప్రయోగాత్మక పాత్రలలో నటించడానికి ఆసక్తి చూపుతారని చెప్పాలి.ఈ క్రమంలోనే త్వరలోనే కమల్ హాసన్ మరో ఒక ప్రయోగాత్మక పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Telugu Kalki, Kalki Review, Kamal Hassan, Prabhas, Prabhas Kalki, Telugu Kalki-M

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)!హీరోగా నాగ్ అశ్విన్ (Nag Aswin) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం కల్కి(Kalki ) ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.ఇక ఈ సినిమాలో అమితాబ్ కమల్ హాసన్ వంటి వారందరూ కూడా కీలకపాత్రలో నటిస్తున్నారు.ఇప్పటికే అమితాబ్ కి సంబంధించిన అప్డేట్స్ విడుదల చేసినప్పటికీ కమల్ హాసన్ పాత్రకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ విడుదల చేయలేదు.

Telugu Kalki, Kalki Review, Kamal Hassan, Prabhas, Prabhas Kalki, Telugu Kalki-M

ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ లో కమల్ హాసన్ లుక్ ఎలా ఉంటుందో చూపించారు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప అక్కడ కమల్ హాసన్ అనే విషయాన్ని గుర్తుపట్టలేరు.ఎక్కువ వయసు కలిగినటువంటి పాత్రలో ముడతలు పడిన మొహంతో కమల్ హాసన్ కనిపిస్తారు.అయితే ఈ విధంగా కమల్ హాసన్ కనిపించడం కోసం చాలా కష్టపడ్డారని తెలుస్తుంది.

ఈ పాత్రలో కమల్ హాసన్ ప్రోస్థటిక్ మేకప్ వేసుకున్నారట.ఈ మేకప్ వేయడానికి ఏకంగా మూడు గంటల పాటు సమయం పడుతుందని ఈ మేకప్ వేయడానికి విదేశాల నుంచి నిపుణులను ప్రత్యేకంగా పిలిపించినట్టు తెలుస్తుంది.

ఇలా మేకప్ వేసుకోవడం కోసమే మూడు గంటలు వెయిట్ చేయడం అంటే మామూలు విషయం కాదు ఇలా సినిమాల పట్ల కమల్ చూపించే డెడికేషన్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube