ఘనంగా అర్జున్ కుమార్తె ఐశ్వర్య వివాహం..ఫోటోలు వైరల్!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటుడు అర్జున్ సర్జా (Arjun Sarja) ఒకరు.సౌత్ ఇండియన్ యాక్షన్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

 Aishwarya Arjun And Umapathi Wedding Photos Goes Viral , Aishwarya,umapathi, Arj-TeluguStop.com

ఇకపోతే అర్జున్ ప్రస్తుతం పలు సినిమాలలో కీలక పాత్రలలో నటించడమే కాకుండా దర్శకుడిగా నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.ఇక ఈయన నట వారసురాలిగా తన పెద్ద కుమార్తె ఐశ్వర్య(Aishwarya) ను కూడా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం చేశారు.

ఇక ఈమె కూడా ప్రస్తుతం హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నారు.ఇప్పటికే ఐశ్వర్య తమిళ సినిమాలతో పాటు కన్నడ భాష చిత్రాలలో కూడా నటించారు.ఇదిలా ఉండగా ఇటీవల ఐశ్వర్య పెళ్లి పీటలు ఎక్కిన సంగతి మనకు తెలిసిందే.జూన్ 10వ తేదీ చెన్నైలోనే హనుమాన్ ఆలయంలో వీరి వివాహం ఎంతో ఘనంగా జరిగింది.

ఐశ్వర్య ప్రముఖ కోలీవుడ్ నటుడు తంబీ రామయ్య (Thambi Ramayya)కుమారుడు ఉమాపతితో(Umapathi ) ప్రేమలో పడ్డారు.

ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.నిజానికి ఈ రెండు కుటుంబాల మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది.ఈ క్రమంలోనే ఉమాపతితో ప్రేమలో పడిన ఐశ్వర్య ప్రేమ విషయం పెద్దలకు తెలియడంతో గత ఏడాది అక్టోబర్ నెలలో ఎంతో ఘనంగా నిశ్చితార్థపు వేడుకలు జరుపుకున్నారు.

ఇక జూన్ 10వ తేదీ వీరి వివాహం జరిగింది.వీరి వివాహపు వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇక ఐశ్వర్య సైతం తన పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.దీనితో ఇవి కాస్త వైరల్ గా మారడంతో అభిమానులు ఈ కొత్త జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube