తమిళ్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు రజనీకాంత్…( Rajinikanth ) ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను చేస్తూ ఈ ఏజ్ లో కూడా ఎవ్వరు టచ్ చేయని రేంజ్ లో ముందుకు దుసుకెళ్తున్నాడు…ఇక ఇలాంటి రజనీకాంత్ తో సినిమాలు చేయడానికి చాలామంది దర్శకులు ఎదురు చేస్తున్నప్పటికీ తను మాత్రం సెలెక్టెడ్ డైరెక్టర్ల తోనే సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.
ఇక గత సంవత్సరం నెల్సన్ అనే డైరెక్టర్ తో ‘జైలర్ ‘ అనే సినిమా చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.
ఇక ఈ సంవత్సరం ఆయనతోనే ‘జైలర్ 2’( Jailer 2 ) అనే సినిమా చేస్తూనే లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో ‘కూలీ ‘( Coolie ) అనే సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఇక ఈ సినిమాకు సంబంధించిన భారీ సెట్ ను కూడా లోకేష్ కనకరాజు వేయిస్తున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఆ ఒక్క సెట్ లోనే రజనీకాంత్ మీద కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించే అవకాశాలు ఉన్నాయట.ఇక అందుకోసమే దానీ మీద భారీగా డబ్బులు కేటాయించి మరి ఆ సెట్ వేయిస్తున్నారు.ఇక అందులో భాగంగానే ఈ సినిమాలో రజనీకాంత్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక ఇదిలా ఉంటే డైరెక్టర్ ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ ను కూడా డిజైన్ చేస్తున్నాడట.మరి ఈ ఐటెం సాంగ్ లో ఎవరు నటిస్తున్నారు అనే వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం శృతిహాసన్( Shruti Haasan ) ని ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ లో తీసుకోవాలనే ఉద్దేశ్యం లో లోకేష్ కనకరాజు( Lokesh Kanagaraj ) ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే జైలర్ సినిమాలో తమన్నాతో ఐటెం సాంగ్ చేయించిన రజనీకాంత్ ఈ సినిమాలో శృతిహాసన్ కి అవకాశాన్ని ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.ఇక ఇప్పటికి శృతి హాసన్ పలు సినిమాల్లో కూడా ఐటెం సాంగ్స్ చేసి మెప్పించింది.ఇక ఈ సినిమాలో రజనీకాంత్ వింటేజ్ లుక్స్ లో కనిపిస్తుండటం విశేషం…