తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది డైరెక్టర్లు వాళ్ల సినిమాలతో మంచి గుర్తింపును ఏర్పరుచుకున్నారు.ఇక వైవిఎస్ చౌదరి( YVS Chowdary ) లాంటి డైరెక్టర్ కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు.
ఇక ఆయన తీసిన ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి’ సినిమా నుంచి సాయి ధరమ్ తేజ్ తో చేసిన రేయ్ సినిమా వరకు ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక డిఫరెంట్ కంటెంట్ అయితే ఉంటుంది.

అందువల్లే ఆయన చాలా ఎక్కువ రోజులపాటు ఇండస్ట్రీలో తన మనుగడను కొనసాగిస్తూ వచ్చారు.ఇక దాదాపు పది సంవత్సరాల మరోసారి ఆయన మెగా ఫోన్ పట్టబోతున్నారు.ఇక నందమూరి ఫ్యామిలీలో జానకిరామ్( Janakiram ) కొడుకు అయిన ఎన్ టి ఆర్ ని( NTR ) ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడు.
అయితే ఈయన చేయబోయే సినిమా స్టోరీ ఏంటి అంటే ఈ జనరేషన్ లో ఉన్న యూత్ ని బేస్ చేసుకొని ఒక కథ రాసుకున్నారట.ఇక దానికి సంబంధించినట్టుగానే ఆ కథని తెరకెక్కించాలనే ఉద్దేశ్యంతో ఆయన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు.

ఇక అందులో భాగంగానే ఈ సంవత్సరం ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లి ఈ సంవత్సరం ఎండింగ్ కి గాని లేదా వచ్చే సంవత్సరం స్టార్టింగ్ లో గాని ఈ సినిమాని రిలీజ్ చేయాలని చూస్తున్నారు.ఇక మొత్తానికైతే నందమూరి ఫ్యామిలీ( Nandamuri Family ) నుంచి మూడోవ ఎన్టీఆర్ కూడా బరిలోకి దిగుతుండటం విశేషం…మరి ఇద్దరు ఎన్టీఆర్ లా మాదిరిగానే ఈయన కూడా సూపర్ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనే విషయాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ప్రస్తుతం వైవిఎస్ చౌదరి ఈ జనరేషన్ కి తగ్గట్టుగా సినిమాలు తీయగలడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
.







