వైరల్ వీడియో: వంటగదిలో పేలిన సిలిండర్.. అదృష్టం ఏమిటంటే..

ప్రస్తుతం ప్రతి ఇంట్లో దాదాపు గ్యాస్ సిలిండర్ల( Gas Cylinder ) వినియోగం పరిపాటిగానే మారిపోయింది.ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మహిళలకు గ్యాస్ సిలిండర్స్ ను సబ్సిడీ రూపంలో అందిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు గ్యాస్ మీద వంట చేయడానికి ఇష్టపడుతున్నారు.

 Lpg Cylinder Explodes In The Kitchen Video Viral Details, Viral Video, Social Me-TeluguStop.com

అయితే ఒక్కోసారి ఈ గ్యాస్ సిలిండర్ల వల్ల మంచితో పాటు అనర్ధాలు కూడా సంభవిస్తుంటాయి.అప్పుడప్పుడు అవి ఒక్కసారిగా పేలి ఆస్తి నష్టంతోపాటు ప్రాణనష్టం కూడా జరిగిన సంఘటనలు అనేకం ఉన్నాయి.

ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కూడా చాలానే కనబడతాయి.తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో( Social Media ) తెగ వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియో గురించి పూర్తి వివరాలు చూస్తే.

ఓ మహిళ వంటింట్లో( Kitchen ) స్టౌ పై ఏదో పెట్టేసి పనిలో పనిగా పక్కన సింక్ వద్ద గిన్నెలను శుభ్రం చేసుకుంటుంది.అయితే ఒక్కసారిగా తాను నిలబడిన చోట హఠాత్తుగా గ్యాస్ సిలిండర్ పేలిపోయింది.ఆ దెబ్బకు ఆ మహిళ ( Woman ) ఒక్కసారిగా ఎగిరిపడి కింద పడిపోయింది.

అంతేకాదు వంట గదిలోని సామాన్లు కూడా చెల్లాచెదురుగా కింద పడిపోయాయి.ఈ భయాందోళనకర పరిస్థితిని అనుభవించిన మహిళ పెద్దగా అరుస్తూ వంట గదిలో నుంచి బయటికి పరిగెత్తింది.

దీంతో వెంటనే ఇంట్లోనే వ్యక్తి అక్కడ పరిస్థితి ఏం జరిగిందో చూడడానికి అటువైపుగా వెళ్ళాడు.

ఇకపోతే ఇక్కడ అదృష్టం ఏమిటంటే.గ్యాస్ సిలిండర్లో గ్యాస్ కొద్దిగా ఉండడం చాలా మేలు అయ్యింది.దానికి తీవ్రత కొద్దీ ఉండడం సరిపోయింది కాబట్టి ప్రాణాలతో ఆమె మిగిలింది.

అది గ్యాస్ సిలిండర్ ఫుల్ గా ఉండి ఉంటే మాత్రం ఇంకా పెద్ద అపాయమే జరిగి ఉండేది.ఇప్పటికి ఈ వీడియోకి 1.5 లక్షల వ్యూస్ రాగా.వేలాదిమంది వీడియోకి కామెంట్ చేస్తున్నారు.

ఈ భయంకరమైన వీడియోని మీరు కూడా ఓసారి వీక్షించండి.మీకేమనిపించిందో ఓసారి కామెంట్ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube