వైరల్ వీడియో: ఇలా తయారయ్యారెంట్ర బాబు.. ఫేషియల్ చేయించుకోవడం కోసం వస్తే.?

ప్రతినిత్యం సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు ప్రతిరోజు వస్తూనే ఉంటాయి.అందులో కొన్ని వీడియోలు మాత్రమే వైరల్ అవుతుండడం గమనిస్తూనే ఉంటాము.

 Video Viral Barber Spitting On Face Of Man During Massage In Shamli Details, Vir-TeluguStop.com

ఇకపోతే తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని( Uttar Pradesh ) షామ్లిలో షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.ఒక బార్బర్( Barber ) సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైరల్ వీడియోలో ఓ వ్యక్తి ఫేషియల్ మెసేజ్( Facial Massage ) చేయించుకోవడానికి సెలూన్ కు వెళ్ళగా అక్కడ ఫేషియల్ మసాజ్ చేస్తున్న సమయంలో బార్బర్ కస్టమర్ ముఖానికి ఉమ్ము రాసి ఫేషియల్ చేస్తున్న సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

ప్రస్తుత రోజుల్లో ప్రతి బార్బర్ షాపు ఓనర్స్ ఫేస్ మసాజ్, ఆయిల్ మసాజ్ ఇలా అనేక రకాల సర్వీసులతో కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.కస్టమర్స్ వచ్చాక ఆ మసాజ్ ఈ మసాజ్ ఆ ఫేషియల్, ఈ ఫేషియల్ అంటూ కస్టమర్ కి ఏదో ఒక సర్వీస్ అందించడానికి తెగ ప్రయత్నం చేస్తుంటారు.ఇలాంటి సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.బార్బర్ ఒక వ్యక్తికి ఫేషియల్ చేస్తున్న సమయంలో ఆ వ్యక్తి కళ్ళు మూసుకొని రిలాక్స్ అవుతున్నాడు.ఆ సమయంలోనే మసాజ్ చేస్తున్న వ్యక్తి అతని చేతిలో ఉమ్ము వేసుకొని దానిని ఆ వ్యక్తి ముఖంపై ఫేస్ మసాజ్ చేశాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియోని సదరు కస్టమర్( Customer ) చూడటంతో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దీంతో వెంటనే నిందితుడుని పోలీసులు అరెస్ట్ చేశారు.షామిలి నగరంలోని భవన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భనేర ఉత్త గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.ఇక ఆ బార్బర్ పేరు అంజాద్.ఏదేమైనా ఇలా బార్బర్ కస్టమర్ ని ఇబ్బందులకు గురి చేయడం సరైన విషయం కాదు.దాంతో పోలీసులు వీడియోని ఆధారంగా చేసుకుని సదరు బార్బర్ ను కటకటాల వెనక్కి పంపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube