పిల్లికి దొరికిన ఎలుక.. ఏం జరిగిందో తెల్సిస్తే నవ్వాపుకోలేరు

ఈ ప్రపంచంలో కొన్ని జంతువులు పుట్టిన దగ్గర నుండి కొన్నింటిని శత్రువులుగా భావిస్తుంటాయి.అందులో పిల్లీ, ఎలుక గురించి అయితే ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

 The Cat Found The Rat If You Know What Happened, You Can Not Laugh, Cat, Rat, V-TeluguStop.com

వాటి మధ్య ప్రకృతి సిద్దంగానే శత్రుత్వం ఉంటుంది. పిల్లులకు ఎలుకలు ఆహారం.

ఒకవేళ ఎలుక పిల్లికి చిక్కిందో.అదే ఆ ఎలుకకు చివరి రోజు అవుతుంది.

దూరం నుండి పిల్లి అలజడి వినిపిస్తే చాలు.ఎలుకలు ఆమడ దూరం పరిగెడతాయి.

వీటి మధ్య నిత్యం యుద్ధం జరుగుతూనే ఉంటుంది.వీటిపై ఇప్పటికే టామ్ అండ్ జర్రీ అనే కార్టూన్ షో కూడా వచ్చింది.

అంతలా ఉంటుంది వీటి మధ్య శత్రుత్వం.తాజాగా ఎలుక, పిల్లికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇంతకీ ఆ వీడియోలో ఏం జరిగిందో తెలుసుకుందాం.

సాధారణంగా ఎలుకలు పిల్లిని చూడగానే పరిగెడతాయి.

కానీ ఓ ఎలుక పొరపాటున పిల్లికి అడ్డంగా దొరికిపోయింది.ఇంకేముంది ఒక్కసారిగా పిల్లి రెచ్చిపోయింది.

ఎలుకను పట్టుకుని ఎడా పెడా వాయించేసింది.ఎలుకను తప్పించుకోనివ్వకుండా దాన్ని చుట్టూ తిరుగుతుంది.

దీంతో ఎలుక పారిపోవడానికి సందు దొరక్క బిక్కుబిక్కుమంటుంది.పిల్లి మాత్రం ఇదే అదునుగా భావించి రెండు చేతులతో ఎలుకను ఇష్టమొచ్చినట్లుగా కొడుతోంది.‘పాపం ఎలుక అంటూ’ ఈ వీడియోపై నెటిజన్లు పలు కామెంట్లు చేస్తున్నారు.అంతేకాదు ఆ వీడియోని చూసి తెగ నవ్వుకుంటున్నారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇప్పటివరకు ఈ వీడియోకి 22 మిలియన్లకు పైగా వ్యూస్ లభించాయి.అయితే 9 లక్షల 40 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేయగా.పలువురు నెటిజన్లు వివిధ రకాల రియాక్షన్లు.

కామెంట్స్ చేశారు.కొంతమందికి ఈ వీడియో ఫన్నీగా అనిపించగా.

మరికొంది అయ్యో పాపం ఎలుక అంటూ కామెంట్ చేశారు.మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్‌ చెప్పండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube