చిరు, మహేష్, వెంకీ సినిమాల భారీ బడ్జెట్లు.. నిర్మాతలకు భారంగా మారిన స్టార్ హీరోల సినిమాలు!

కరోనా మహమ్మారి వల్ల సినీ ఇండస్ట్రీ ఆర్థికంగా నష్టపోయిన విషయం తెలిసిందే.గత రెండేళ్లలో కరోనా మహమ్మారి పుణ్యమా అని సినిమాలు ఆగిపోయాయి.

 Sarkaru Vari Paata Acharya F3 3 Movies Over Budget , Sarkaru Vari Paata  , Achar-TeluguStop.com

అంతేకాకుండా ఆ రెండు ఏళ్ళలో ప్రారంభించిన సినిమాలు అన్నీ కూడా బడ్జెట్లను మింగేశాయి.దీనితో పూర్తిగా వడ్డీల భారం పెరిగిపోయింది.

ఈ వడ్డీల బారాన్ని నిర్మాతలు, బయ్యర్లు మోయాల్సి వచ్చింది.ఇకపోతే కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం భారీ ప్రాజెక్టులు విడుదల అవుతున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే పలు సినిమాలు విడుదల కాగా ఇంకా భారీ ప్రాజెక్టులు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

ఇదిలా ఉంటే సినిమా బడ్జెట్ ల విషయంలో ఇప్పటికే వడ్డీల భారం మోసిన నిర్మాతలు రాబోతున్న సినిమాల ఈ విషయంలో భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

ఇకపోతే ఈ నెలలో విడుదల అవుతున్న ఆచార్య సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే తప్ప నిర్మాతకు పెద్దగా ప్రయోజనం లేదు అని తెలుస్తోంది.ఇప్పటికే ఖర్చులు తడిసి తడిసి మోపు అయ్యాయని అందుకు గల కారణం సినిమాను చాలాకాలం తీయాల్సి వచ్చిందని తెలుస్తోంది.

దీనితో పాటుగా సినిమా లో పలు మార్పులు చేయడంతో సినిమా బడ్జెట్ మరింత పెరిగి పోయిందని తెలుస్తోంది.ఇక మరొక సినీమా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట.

Telugu Acharya, Buyers, Mahesh Babu, Producers, Tollywood, Varun Tej, Venkatesh-

ఈ సినిమా కూడా ఓవర్ బడ్జెట్ వార్తలు వినిపిస్తున్నాయి.మైత్రి మూవీస్ ఈ సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే.కరోనా మహమ్మారి పుణ్యమా అని ఈ సినిమా నిర్మాణానికి కూడా చాలా సమయం పట్టింది.అంతేకాకుండా కోవిడ్ ఖర్చులు కూడా అదనపు భారంగా పడ్డాయి.షెడ్యూల్లో బెటర్మెంట్ లు ఇలా చాలా ఖర్చులు తప్పలేదు.గత రెండు రోజులుగా నిర్మాతలు అయినా మైత్రి మూవీ మేకర్స్ వారు అసలు ఈ సినిమా నిర్మాణానికి ఎంత ఖర్చు అయింది.

ఎంత రేట్లకు అమ్మితే వర్కౌట్ అవుతుంది అన్న లెక్కలు వేస్తున్నారట.మరొక సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్, వెంకటేష్ కలిసి నటిస్తున్న సినిమా ఎఫ్ 3.ఈ సినిమా కూడా ఓవర్ బడ్జెట్ అని తెలుస్తోంది.ఈ సినిమాలో ముఖ్యంగా రెమ్యూనరేషన్లు దాదాపుగా 30 కోట్లకు పైగానే అయ్యాయి.

ఆచార్య సర్కారు వారి పాట సినిమా తో పోల్చుకుంటే ఈ ఖర్చు చాలా తక్కువ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube