పురపాలక,పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆదిమూలపు సురేష్

రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా ఆదిమూలపు సురేష్ గురువారం ఉదయం బాధ్యతలు చేపట్టారు.

అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లో కేటాయించిన ఛాంబరుకు సతీసమేతంగా విచ్చేసిన ఆయనకు వేద పండితులు వేద మంత్రాలు పటిస్తూ పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.

సకల మత సమ్మేళనాన్ని ప్రతిభింభిచే విధంగా ఛాంబరులో హిందూ, క్రైస్తవ మత సాంప్రదాయాలకు అనుగుణంగా పూజనిర్వహించిన తదుపరి మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు.అనంతరం భారత రాజ్యాంగ నిర్మాణ డా.

బి.ఆర్.అంబేద్కర్ 131 జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు.మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రూ.1,445 కోట్లతో 74 పట్లణ ప్రాంతాల్లో 228 మురుగునీటి శుద్ది ప్లాంట్ల నిర్మాణానికి పరిపాలనా అనుమతులను ఇస్తూ తొలి సంతకం చేసినట్లు మంత్రి తెలిపారు.ఇందుకు సంబందించిన టెండర్ల ప్రక్రియ కూడా త్వరలోనే ప్రారంభించడం జరుగుతుందన్నారు.

రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, పత్యాక కార్యదర్శి రామ్మెన్, సంపత్ కుమార్ తదితర అధికారులతో పాటు పలువురు అనధికారులు మంత్రికి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తనపై ఉన్న నమ్మకం, విశ్వాసంతో మళ్లీ మంత్రి పదవిని కట్టబెట్టినందుకు కృతజ్ఞతలు, సుమాంజలు తెలియజేశారు.ముఖ్యమంత్రికి తనపై ఉన్న విశ్వాసాన్ని ఒమ్ముచేయకుండా శాఖా పరంగా తనకు అప్పగించిన పనులను ఎంతో చిత్తశుద్దితో, త్రికరణ శుద్దితో నిర్వహిస్తానన్నారు.

Advertisement

ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న స్వచ్ఛ సంకల్పాన్ని సాకారం చేసే దిశలో అడుగులువేస్తూ రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతానన్నారు.క్లీన్ ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా బహిరంగ మలవిసర్జన రహిత, చెత్త బుట్ట రహిత, చెత్త రహిత నగరాలు రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే తన ప్రధాన కర్తవ్యమన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో పెద్దఎత్తున అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు.ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా పరిపాలనా మరియు అభివృద్ది వికేంద్రీకరణకు ప్రాధాన్యత నిస్తూ రాష్ట్రంలోని అన్ని నగరాలను సమానంగా అభివృద్ది చేస్తామని, అన్ని నగరాల్లో మెరుగైన వసతులు, ఆరోగ్య సేవలు అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

అభివృద్ది, సంక్షేమానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తున్నదని, అభివృద్ది పనుల అమల్లో భాగంగా 228 మురుగునీటి శుద్ది ప్లాంట్ల నిర్మాణానికి ఆమోదం తెలపడంతోపాటు సంక్షేమానికి కూడా ప్రాధాన్యత నిస్తున్న విషయాన్ని ధృవీకరించే విధంగా మచిలీపట్నంలో ఒక పారిశుద్య కార్మికుడు చనిపోయిన సందర్భంగా అతని కుమారుని కారుణ్య నియామకి కూడా ఆమోదం తెలియజేయడం జరిగిందని మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖకు చెందిన అధికారులు, పలువురు అనధికారులు పాల్గొన్నారు.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు