జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు( Pawan Kalyan ) రోజురోజుకీ మద్దతు పెరుగుతుంది.ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది తనకు మద్దతు ప్రకటించడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
నిజానికి చిరంజీవి ( Chiranjeevi ) పవన్ కళ్యాణ్ కు మద్దతు గా ఒక వీడియోని రిలీజ్ చేసిన వెంటనే నాని, తేజ సజ్జ, రాజ్ తరుణ్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు సైతం పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు.ఇక ఇప్పుడు అల్లు అర్జున్,( Allu Arjun ) పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ ఎక్స్ లో ఇలా రాశారు.“మీరు ఎంచుకున్న రాజకీయ మార్గంలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మీరు అనుకున్న లక్ష్యాలను, కోరికలను నెరవేర్చుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ ముందుకెళ్లాలని ఒక కుటుంబ సభ్యుడిగా నేనెప్పుడూ మీ వెంటే ఉంటానని మీకు మద్దతుగా నిలుస్తాం”.అంటూ అల్లు అర్జున్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.ఇక దీంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
నిజానికి అల్లు అర్జున్ లాంటి ఒక స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇస్తారని ఎవరు అనుకోలేదు.ఎందుకంటే సినిమాలు వేరు, రాజకీయాలు( Politics ) వేరు రాజకీయంగా ఎవరికైనా సపోర్ట్ చేస్తే అధికార పార్టీ నుంచి ఆ హీరోలకు సంబంధించిన సినిమాల విషయంలో కొన్ని ఉడుదుడుకులైతే ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.
కానీ వాటన్నింటినీ ఎదిరించి వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలుస్తున్నారు అంటే నిజంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న పవర్ ఏంటో వీళ్లంతా కలిపి చూపిస్తున్నారు.ఇక పిఠాపురం నియోజకవర్గంలో( Pithapuram Constituency ) పవన్ కళ్యాణ్ ఈసారి విజయం సాధించి అసెంబ్లీ లో అడుగు పెట్టాలని ప్రతి ఒక్క అభిమాని కూడా కోరుకుంటున్నారు.పిఠాపురం నియోజకవర్గ ప్రజలు కూడా ఈసారి పవన్ కళ్యాణ్ కి పట్టం కట్టబోతున్నట్టుగా వివిధ సర్వేలు తెలుపుతున్నాయి…
.