తెలుగు సినిమా ఇండస్ట్రి లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్…( Ram Charan ) ప్రస్తుతం ఆయన గేమ్ చేంజర్( Game Changer ) అనే సినిమాతో చాలా బిజీగా కొనసాగుతున్నాడు.అయితే రామ్ చరణ్ సాధించిన విజయాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు.
ఇక ఇప్పటికే ఆయన వరుస సక్సెస్ లను అందుకుంటూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇక ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా కూడా అవతరించి తనను మించిన నటుడు మరొకరు లేరు అనేలా తన నటనలో చాలా వైవిధ్యాన్ని చూపిస్తున్నాడు.
ఇక ఇప్పుడు శంకర్ తో( Shankar ) చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన లీకేజ్ ఒకటి బయటకు వచ్చింది.అది ఏంటి అంటే రామ్ చరణ్ ఇందులో డ్యూయల్ రోల్ పోషిస్తున్న విషయం మనకు తెలిసిందే.అయితే అందులో ఒకటి కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అని ప్రచారం అయితే జరుగుతుంది.అయితే ఆ క్యారెక్టర్ ముందుగా నెగిటివ్ షేడ్స్ లో ఉండి ఆ తర్వాత మళ్లీ పాజిటివ్ గా మారబోతున్నట్టుగా కూడా వార్తలైతే వినిపిస్తున్నాయి.
ఇక ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ సినిమాని తొందరలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలైతే చేస్తున్నారు.ఇక ఇప్పటికే రామ్ చరణ్ ‘త్రిబుల్ ఆర్ ‘( RRR ) సినిమా వచ్చి దాదాపు 2 సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పటివరకు ఆయన మరో సినిమా ను అయితే రిలీజ్ చేయలేదు.ఇక శంకర్ సినిమా మీదనే మొదటి నుంచి చాలా డెడికేటేడ్ గా వర్క్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు… చూడాలి మరి ఈ సినిమాతో శంకర్ రామ్ చరణ్ కి భారీ సక్సెస్ ని అందిస్తాడా అనేది…ఇక చరణ్ ఇన్ని సంవత్సరాలు నిరీక్షణ కి ప్రతిఫలం అయితే దక్కుతుందా లేదా అనేది ఇప్పుడు కీలకంగా మారనుంది…
.