జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలిపిన అల్లు అర్జున్..!!

2024 ఎన్నికలలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.2019 ఎన్నికలలో భీమవరం, గాజువాక నుండి పోటీ చేసి ఓడిపోయారు.దీంతో ఈసారి పిఠాపురం( Pithapuram ) నుండి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని పవన్ భావిస్తున్నారు.ఈ క్రమంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కి మద్దతుగా తెలుగు ఇండస్ట్రీకి చెందిన చాలామంది నటీనటులు జనసేన( Janasena ) తరఫున ప్రచారం చేయడం జరిగింది.

 Allu Arjun Supports Janasena Chief Pawan Kalyan Details, Janasena, Allu Arjun, P-TeluguStop.com

జబర్దస్త్ టీం రాంప్రసాద్, హైపర్ ఆది, గెటప్ శీను, సుడిగాలి సుదీర్ మరి కొంతమంది సీరియల్ నటీనటులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్ పిఠాపురంలో జనసేన తరఫున రోడ్ షోలు ఇంకా అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు.మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ఓ స్పెషల్ వీడియో చేసి పవన్ కళ్యాణ్ ని ఎమ్మెల్యేగా గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరడం జరిగింది.ఇదిలా ఉంటే తాజాగా అల్లు అర్జున్( Allu Arjun ) కూడా పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలిపారు.ఈ క్రమంలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.“మీ ఎన్నికల ప్రయాణానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.ప్రజా సేవ కోసం మీ జీవితాన్ని అంకితం చేసుకుని మీరు ఎంచుకున్నా మార్గం గురించి ఎప్పుడు నేను గర్వపడుతూ ఉంటాను.ఒక కుటుంబ సభ్యుడిగా నా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది.

మీరు కోరుకున్నది సాధించాలని ఆకాంక్షిస్తున్నా” అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube