రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఇన్ ఛార్జ్ చల్మెడ లక్ష్మీ నరసింహరావు నివాసంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా చల్మెడ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని, ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడం లేదని ఆరచోపించారు.
ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని, ఇప్పటికైనా ప్రజలు విజ్ఞతతో ఆలోచించి కారు గుర్తుపై ఓటు వేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు
.