మలబద్ధకం.పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఎందరినో వేధించే కామన్ సమస్య ఇది.ఎప్పుడో ఒక సారి ఇబ్బంది పెడితే.పెద్ద సమస్యేమి కాదు.
కానీ, కొందరు తరచూ మలబద్ధకాన్ని ఎదుర్కొంటూనే ఉంటారు.ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, ఫైబర్ ఫుడ్‌ను సరిగ్గా తీసుకోకపోవడం, ఒత్తిడి, డిప్రెషన్, ఎక్కువ సమయం ఒకే చోట కూర్చుని ఉండడం, పరి మితికి మంచి చాక్లెట్స్‌ను తినడం, శరీరానికి సరిపడా నీటిని అందించక పోవడం, కొన్ని రకాల మందుల వాడకం ఇలా రకరకాల కారణాల వల్ల మలబద్ధకానికి గురవుతుంటారు.అయితే కారణం ఏదైనప్పటికీ.రాత్రి భోజనం చేసిన అర గంట తర్వాత కేవలం ఇరవై నిమిషాల పాటు వాకింగ్ చేస్తే మలబద్ధకం పరార్ అవుతుందట.అవును, మీరు విన్నది నిజమే.నైట్ భోజనం చేసిన వెంటనే చాలా మంది నిద్ర పోతుంటారు.
కానీ, భోజనం చేసిన అర గంట తర్వాత ఇరవై అంటే ఇరవై నిమిషాల పాటు వాకింగ్ చేయండి.
ఇలా చేస్తే శరీరం మరింత గ్యాస్ట్రిక్ ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తుంది.
ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.దాంతో మలబద్ధకం సమస్య దూరం అవుతుంది.
మలబద్ధకమే కాదు ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు సైతం తగ్గు ముఖం పడతాయి.అలాగే రాత్రి భోజనం చేసిన అర గంట తర్వాత కాసేపు వాకింగ్ చేస్తే శరీరంలోని క్యాలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయి.
ఫలితంగా వెయిట్ లాస్ అవుతాయి.
అంతే కాదు, రాత్రి భోజనం చేసిన అర గంట తర్వాత కాసేపు వాకింగ్ చేస్తే త్వరగా, వేగంగా నిద్ర పడుతుంది.కీళ్లు, ఎముకలు గట్టి పడతాయి.కండరాలు బలంగా మారతాయి.
మరియు ఒత్తిడి, ఆందోళనలు దూరమై మనసు ప్రశాంతంగా మారి పోతుంది.