కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం దేవర.( Devara Movie ) ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు ఈ సినిమాపై అంచనాలను పెంచాయి.ఇకపోతే మే 20వ తేదీన ఎన్టీఆర్ బర్త్డే( NTR Birthday ) వస్తున్నా కూడా ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్లు రాకపోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
మూవీ మీకు ఎలాంటి స్పందన లేకపోవడంతో అభిమానులు ఆలోచనలో పడ్డారు.మరికొందరు అభిమానులు ఆ రెండింటి విషయంలో క్లారిటీ ఇవ్వండి ప్లీజ్ అంటూ దేవర మూవీ మేకర్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు.కాగా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మూవీ టీమ్ మ్యూజికల్ ట్రీట్ ఇస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.సినిమా ఫస్ట్ సింగిల్‌ను( Devara First Single ) రిలీజ్ చేస్తారని అంతా అనుకుంటున్నారు.
దీనిపై ఒక క్లారిటీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.అలాగే మరో విషయం ఏంటంటే ఈ చిత్రాన్ని అక్టోబర్ 10న రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ ఇప్పటికే ప్రకటించింది.
కానీ సోషల్ మీడియాాలో కొద్దిరోజులుగా దేవర సినిమా ప్రీపోన్ అవుతుందని వార్తలు వస్తున్నాయి.అనుకున్న తేదీ కంటే ముందుగానే అంటే సెప్టెంబర్ లోనే సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.మరీ ఈ విషయంపై కూడా మూవీ టీమ్ స్పందించాలీ అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.మరి అభిమానుల రిక్వెస్ట్ మేరకు మూవీ మేకర్స్ ఈ సినిమాపై వస్తున్నా వార్తలపై ఎలా స్పందిస్తారో చూడాలి మరి.