జనసేనకు ఓటు వేయద్దు.. నాగబాబు మాజీ అల్లుడు కామెంట్స్ వైరల్!

ఏపీలో మరొక మూడు రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఎన్నికల హడావిడి కొనసాగుతుంది.ఈ క్రమంలోనే పార్టీ అధినేతలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

 Jonnalagadda Venkata Chaitanya Sensational Comments About Mega Family Details, J-TeluguStop.com

అయితే మూడు రోజులలో ఎన్నికలు జరగబోతున్నాయన్న తరుణంలో జనసేన( Janasena ) అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కు తన మాజీ అల్లుడు గట్టి షాక్ ఇచ్చారని చెప్పాలి.నాగబాబు( Nagababu ) మాజీ అల్లుడు జొన్నలగడ్డ వెంకట చైతన్య( Jonnalagadda Venkata Chaitanya ) ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

నిహారికను( Niharika ) పెళ్లి చేసుకున్న తర్వాత వెంకట చైతన్యకు బేదాభిప్రాయాలు రావడంతో తనకు విడాకులు ఇచ్చి విడిపోయారు.ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ గురించి( Mega Family ) ఈయన మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ.జనసేనకు ఎవరు ఓటు వేయద్దని కోరారు.స్వార్థ రాజకీయాల కోసం మెగా ఫ్యామిలీ ఎంతకైనా తెగిస్తుందని తెలిపారు.ప్యాకేజీ కోసం ఎంతటికైనా దిగజారుతారు.

జనసేన సిద్ధాంతాలను చివరికి పవన్ కళ్యాణ్ కూడా పాటించరని తెలిపారు.

ఆయన మాటలకు చేష్టలకు ఏమాత్రం పోలిక ఉండదని వెంకట చైతన్య ఆరోపించారు.ఇక పవన్ కళ్యాణ్ కు పోటీగా పిఠాపురంలో( Pithapuram ) ఎంతోమంది ఆర్టిస్టులు ప్రచారం చేస్తున్నారు.అయితే వారందరూ కూడా భయంతోనే ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కనుసైగల్లోనే పనిచేస్తున్నారని తెలిపారు.ఇక ప్రచారానికి రాకపోతే తమకు అవకాశాలు రావని ఆర్టిస్టులను భయపెట్టడంతో వారు వస్తున్నారని జనసేనను నమ్మి ఎంతోమంది మోసపోయారు అంటూ ఈ సందర్భంగా వెంకటచైతన్య చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube