సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి రాణించిన వారిలో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) కూడా ఒకరు.సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్.
ఇది ఇలా ఉంటే నేడు అనగా మే 9న విజయ్ దేవరకొండ పుట్టినరోజు.( Vijay Devarakonda Birthday ) ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్లను విడుదల చేస్తున్నారు మూవీ మేకర్స్.
విజయ్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో అభిమానులు సెలబ్రెటీలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇకపోతే విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకు కోట్లలో అందుకుంటున్నారు.అలాగే పలు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ భారీగానే సంపాదిస్తున్నాడు విజయ్ దేవరకొండ ఇక విజయ్ ఆస్తి వివరాలు ఎలా ఉన్నాయంటే.విజయ్ దేవరకొండ ఆస్తి( Vijay Devarakonda Assets ) రూ.66 కోట్ల.ఆయన సినిమాలు అలాగే బ్రాండ్ ప్రమోషన్ ద్వారా భారీ మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నాడు.
విజయ్ కు సొంత థియేటర్ కూడా ఉంది.ఈ థియేటర్ వల్ల ఏడాదికి రూ.13 కోట్లు సంపాదిస్తున్నాడు.
ఒక్కో సినిమాకు ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని తెలుస్తోంది.లైగర్ సినిమా( Liger ) కోసం ఏకంగా రూ.35 కోట్లు పారితోషికం తీసుకున్నాడు విజయ్.ఒక్కో బ్రాండ్ ప్రమోషన్ కోసం 1 కోటి రూపాయిలు అందుకుంటున్నాడు.విజయ్ దేవరకొండకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఒక ఇల్లు ఉంది.ఆ ఇంటి ధర 15 కోట్ల రూపాయలు.వీటితో పాటు అనేక స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టాడు.
ఇక విజయ్ దేవరకొండకు కార్ క్రేజ్ ఉంది.అతని దగ్గర ఫోర్డ్ మస్టాంగ్ కారు( Ford Mustang ) ఉంది.
దీని ధర 74 లక్షల రూపాయలు.బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ రూ.61 లక్షలు , మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎస్ 350 రూ.88 లక్షలు వోల్వో ఎక్స్‌సి 90 రూ.1.31 కోట్లు, ఆడి క్యూ7 రూ.80 లక్షలుగా ఉన్నాయి.