ఏపీలో పర్యటించనున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) గతంలో కంటే ఇప్పుడు పుంజుకుంది.వైయస్ షర్మిలకి( YS Sharmila ) కాంగ్రెస్ అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పజెప్పిన తర్వాత.

 Congress Leader Rahul Gandhi To Visit Andhra Pradesh Details, Ap Elections, Rahu-TeluguStop.com

గతంలో కంటే కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది.ఇటీవల అధికార పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది.

  ఏపీ ఎన్నికల ప్రచారంలో  పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భారీ ఎత్తున పాల్గొంటున్నారు.రాహుల్ గాంధీ( Rahul Gandhi ) ప్రధాని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా విషయంపై మొదటి సంతకం పెడతారని పలు హామీలు ప్రకటిస్తున్నారు.

ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో కలిసి వామపక్షాలు పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నాయి.కడప ఎంపీగా( Kadapa Parliament ) వైయస్ షర్మిల పోటీ చేస్తున్నారు.ఈ క్రమంలో ఏపీలో ఎన్నికలవేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనటానికి రెడీ అయ్యారు.రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి చివరి రోజు అయిన మే 11వ తారీకు కడప జిల్లాలో ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొననున్నారు.

శనివారం ఉదయం 10 గంటలకు కడప విమానాశ్రయం చేరుకుని ముందుగా రోడ్ షోలో పాల్గొంటారు.ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు.ఈ క్రమంలో రాహుల్ రాకతో ఏపీలో కాంగ్రెస్ కి ఏమేరకు లబ్ధి చేకూరుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube