ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య కేసుతో ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపిస్తూ ముగ్గురు భారతీయులను కెనడా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.వీరిని వీడియో లింక్ ద్వారా తొలిసారిగా కోర్టు ఎదుట హాజరుపరిచారు.
అనుమానితుల్లో ఒకరైన కరణ్ బ్రార్.( Karan Brar ) తాను స్టడీ పర్మిట్‌పై కెనడాకు వచ్చానని, దానిని పొందేందుకు కేవలం రోజుల సమయమే పట్టిందని సోషల్ మీడియాలో చెప్పినట్లుగా కెనడా కేంద్రంగా పనిచేస్తోన్న గ్లోబల్ న్యూస్ నివేదించింది.
కరణ్ బ్రార్ 2019లో ఆన్లైన్లో పోస్ట్ చేసిన వీడియో ప్రకారం .తాను పంజాబ్ రాష్ట్రం( Punjab ) భటిండాలోని ఎథిక్వర్క్స్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ద్వారా స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పాడు.అనంతరం తన స్టడీ వీసాను( Study Visa ) కొద్దిరోజుల్లోనే అందుకున్నట్లు గ్లోబల్ న్యూస్ తెలిపింది.భటిండాకు ఉత్తరాన ఉన్న కొట్కాపురాకు చెందిన సదరు ఇమ్మిగ్రేషన్ సంస్థ.
బ్రార్ ప్రమోట్ చేసిన వీడియోను తన ఫేస్బుక్ పేజీల్ అప్లోడ్ చేసింది.కొట్కాపురా నుంచి మరో సక్సెస్ఫుల్ క్లయింట్ అని ఆ సంస్థ పేర్కొంది.
అయితే అనుమానితులు కెనడాకు( Canada ) ఎలా వచ్చారనే ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఆ దేశ ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్( Immigration Minister Marc Miller ) నిరాకరించారు.అయితే నిజ్జర్ హత్యకు మూడేళ్ల ముందు స్టూడెంట్ పర్మిట్ ద్వారా బ్రార్ కెనడాలో అడుగుపెట్టినట్లుగా ఆన్లైన్ పోస్టులు చెబుతున్నాయి.బ్రార్‌కు చెందినదిగా చెబుతోన్న ఫేస్బుక్ పేజీ ప్రకారం.అతను ఏప్రిల్ 30, 2020న కాల్గరీలోని బో వ్యాలీ కాలేజీలో తన చదువును ప్రారంభించి.మే 4, 2020న ఎడ్మోంటన్‌కు వెళ్లినట్లు గ్లోబల్ న్యూస్ నివేదించింది.అయితే ఈ విషయంపై ఇమ్మిగ్రేషన్ , రెఫ్యూజీస్, సిటిజన్‌షిప్ కెనడా స్పందించాల్సి వుంది.
కాగా.నిజ్జర్ హత్య కేసులో కరణ్ ప్రీత్ సింగ్, కమల్ ప్రీత్ సింగ్, కరణ్ బ్రార్‌లను అల్బెర్టా ప్రావిన్స్‌లోని ఎడ్మంటన్ సిటీలో అరెస్ట్ చేశారు.ఆర్సీఎంపీ (సర్రే)కి చెందిన ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఐహెచ్ఐటీ) , ఎడ్మంటన్ పోలీస్ సర్వీస్ సాయంతో ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.