సూపర్ స్టార్ రజనీకాంత్ కు ( Rajinikanth ) కష్టాలు ఉంటాయా అనే ప్రశ్నకు ఎక్కువమంది ఉండవనే సమాధానం చెబుతారు.రజనీకాంత్ ఆస్తుల విలువ వందల కోట్ల రూపాయలు అనే సంగతి తెలిసిందే.
కొన్ని తరాలు తిన్నా తరగని ఆస్తిని ఆయన సంపాదించారు.అయితే రజనీకాంత్ కూడా ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారట.
వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఆయన నిజంగానే ఆత్మహత్య చేసుకోవాలని భావించారట.
నేను ఒకప్పుడు బస్ కండక్టర్( Bus Conductor ) అని అందరికీ తెలుసని అంతకు ముందు నేను ఆఫీస్ బాయ్ నని కూలీగా కూడా పని చేసేవాడినని రజనీకాంత్ చెప్పుకొచ్చారు.
నేను పేద కుటుంబంలో జన్మించానని బాల్యం నుంచి ధనవంతుడిని కావాలని అనుకున్నానని నేను దేనికీ భయపడేవాడిని కాదని రజనీకాంత్ అన్నారు.ఒకసారి నేను భయపడి ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నానని ఆయన వెల్లడించారు.
ఆ సమయంలో నాకు కల వచ్చిందని తెల్లటి గడ్డంతో ఉన్న వ్యక్తి సంతోర్వా నదికి అవతలి వైపు కూర్చున్నాడని అతను నన్ను దగ్గరికి పిలిచాడని నేను అతని దగ్గరకు పరుగెత్తానని మరుసటిరోజు ఆ దేవుడు ఎవరని అడిగితే శ్రీ రాఘవేంద్ర స్వామి( Sri Raghavendra Swamy ) అని చెప్పారని రజనీకాంత్ కామెంట్లు చేశారు.నేను ఒక మఠానికి వెళ్లి ధనవంతుడిని అవ్వాలని కోరుకుని గురువారం గురువారం ఉపవాసం చేస్తూ వచ్చానని బాలచందర్ సార్ నా టాలెంట్ ను గుర్తించారని ఆయన అన్నారు.
ప్రస్తుతం రజనీకాంత్ వేట్టయాన్( Vettaiyan ) అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా తెలుగులో వేటగాడు అనే టైటిల్ తో రిలీజ్ కానుంది.ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఏ రేంజ్ లో అదరగొడుతుందో చూడాల్సి ఉంది.సూపర్ స్టార్ రజనీకాంత్ రికార్డ్ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.