సోషల్ మీడియానా మజాకా.. ఫుడ్ డెలివరీ బాయ్ కి బైక్ కొనిచ్చిన ట్విట్టర్ యూజర్లు..!

ప్రజల జీవితాలను మార్చే శక్తి సోషల్ మీడియాకు ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.తెలియని వ్యక్తి చేసిన ఒక్క పోస్ట్ వల్ల ఇతరుల జీవితాలు ఎలా మారిపోయాయో చాలా సార్లు చూశాం.

 Rajasthan Zomato Food Delivery Boy Durga Meena Buys Bike With Twitter Users Fund-TeluguStop.com

తాజాగా ఈ జాబితాలోకి మరొక వ్యక్తి చేరాడు.అతని పేరు దుర్గా మీనాగా శర్మ.

ఇతను ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు.అయితే దుర్గా అందరి లాగా కాకుండా ఫుడ్ డెలివరీ చేయడానికి బైక్ కు బదులుగా సైకిల్‌ని వాడుతున్నాడు.

ఎర్రటి ఎండలో కష్టపడుతున్న ఇతన్ని చూసి చలించిపోయిన ఆదిత్య శర్మ అనే కస్టమర్ సహాయం చేయాలనుకున్నాడు.ఆదిత్య ఈ ఫుడ్ డెలివరీ బాయ్ గురించి ట్విట్టర్‌లో ఒక పోస్ట్ పెట్టగా యూజర్లందరూ కలిసి అతనికి ఒక బైక్ కొనిచ్చారు.

వివరాల్లోకి వెళితే… 2 రోజుల క్రితం రాజస్థాన్ నివాసి ఆదిత్య శర్మ, జొమాటో నుంచి ఫుడ్ ఆర్డర్ చేశాడు.ఆ సమయంలో బయట 42 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది.

ఇలాంటి ఉష్ణోగ్రతలో డెలివరీ అందించడానికి డెలివరీ బాయ్ ఓ సైకిల్‌పై ఆదిత్య నివాసానికి చేరుకున్నాడు.అంతే కాదు కరెక్ట్ టైంలో డెలివరీ అందించాడు.

అయితే సైకిల్ పై వచ్చిన డెలివరీ బాయ్ పరిస్థితిని చూసి ఆదిత్య శర్మ చలించిపోయాడు.అనంతరం డెలివరీ చేసిన వ్యక్తి ఫోటో తీసి అతని కథను మొత్తం ట్విట్టర్ థ్రెడ్‌లో వివరించాడు.

ఆర్థిక సమస్యల కారణంగా డెలివరీ బాయ్ గా 31 ఏళ్ల దుర్గా మీనా పని చేస్తున్నట్లు తెలిపాడు.

ఆదిత్య శర్మ పెట్టిన ట్వీట్ ప్రకారం మీనా నెలకు రూ.10,000 సంపాదిస్తున్నాడు.గత 12 ఏళ్లుగా టీచర్ గాను పని చేస్తున్నాడు.

బీకాంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసిన దుర్గా పోస్ట్-గ్రాడ్యుయేషన్‌ను కూడా కంప్లీట్ చేయాలని భావిస్తున్నాడు కానీ అందుకు తగినంత డబ్బు అతని దగ్గర లేదు.దీంతో డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు.

ఐతే సైకిల్ పై ఎక్కువగా డెలివరీ ఇవ్వడం చాలా కష్టం అయిపోతుందట.అందుకే బైక్ కోసం డబ్బు ఆదా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు శర్మతో దుర్గా చెప్పాడు.

ఇది విన్న తర్వాత ఆదిత్య శర్మ ఒక ట్వీట్‌ ద్వారా రూ.75,000 క్రౌడ్ ఫండింగ్ ఏర్పాటు చేశాడు.ఇందులో అతను దుర్గా యూపీఐ నంబర్‌ను కూడా షేర్ చేశాడు.ఇది చూసిన నెటిజన్లు కేవలం 24 గంటల్లోనే బైక్‌కు కావలసిన డబ్బుని దానం చేశారు.ఈ మనీతో దుర్గా ఒక బైక్‌ను కొనుక్కున్నాడు.ఇప్పుడు అతను బైక్ పైనే ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు.

అలా సోషల్ మీడియా ఇతని లైఫ్ నే మార్చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube