మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అలా వైకుంఠపురంలో’.ఈ సినిమాలో అల్లు అర్జున్, పూజా హెగ్డే నటీనటులుగా నటించి మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇక ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకుంది.కొన్నికొన్ని సందర్భాల్లో కొన్ని సినిమాలలో కొన్ని సన్నివేశాలను డిలీట్ చేస్తూ ఉంటారు.
ఇక వాటిని ఏదో ఒక సందర్భంలో విడుదల చేస్తూ ఉంటారు.అలా తాజాగా అలా వైకుంఠపురంలో సినిమాకు సంబంధించిన అన్ సీన్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఈ సినిమా ఫైనల్ కట్ లో లేని సన్నివేశాన్ని హిందీ డబ్బింగ్ వర్షన్ లో పెట్టారు.
ఇక ఈ వీడియోను తాజాగా హీరో సుశాంత్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు.తెలుగులో ఈ సీన్ ఉంటే బాగుంటుందని.కానీ ఫైనల్ కట్ లో ఈ సీన్ లేదని తెలిపాడు.
ఇక ఆ వీడియోలో పూజ హెగ్డే దగ్గరకు నివేదా పేతురాజ్, సుశాంత్ వచ్చి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు.
ఇక పూజ వెళ్లి బన్నీతో ఈ విషయం గురించి మాట్లాడుతుంటే.
ఆ సమయంలో బన్నీ చేసిన కామెంట్ కు ఆయనను బాగా కొడుతూ ఓ రేంజ్ లో ఆడుకుంది పూజ.ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఇంత మంచి సీన్ తెలుగులో ఎందుకు తీసేసారని తెగ ప్రశ్నలు వేస్తున్నారు.