భగత్ సింగ్ గురించి మహాత్మాగాంధీ మనసులో ఏమున్నదంటే..

భగత్ సింగ్ స్వాతంత్ర్య పోరాటంలో ఇతర నాయకులకు భిన్నంగా పని చేసేవాడు.స్వాతంత్ర్య ఉద్యమంలో అతని దృష్టి భిన్నంగా ఉండేది.

 What Mahatma Gandhi Had In Mind About Bhagat Singh , Mahatma Gandhi , Bhagat Si-TeluguStop.com

అతని దూకుడు ప్రవర్తన నాటి నేతలకు నచ్చేది కాదు.మహాత్మా గాంధీకి భగత్ సింగ్ ప్రవర్తనను వ్యతిరేకించేవారంటూ అనేక కథలు వినిపిస్తుంటాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాలలో.మహాత్మా గాంధీకి భగత్ సింగ్ అంటే ఇష్టం లేదంటూ పలువురు వ్యాఖ్యానించారు.

భగత్ సింగ్ బలిదానం తర్వాత మహాత్మా గాంధీ ఒక వ్యాసం రాశారు.నేషనల్ ఆర్కైవ్స్ ప్రచురించిన భగత్ సింగ్ ప్రత్యేక సంచికలో ఈ వ్యాసం ప్రచురితమయ్యింది.

ఈ వ్యాసంలో మహాత్మా గాంధీ భగత్ సింగ్‌పై తన అభిప్రాయాలను వెల్లడించారు.“అతను లాహోర్‌లో విద్యార్థిగా ఉన్నప్పుడు నేను చాలాసార్లు చూసినప్పటికీ, అతని రూపం ఇప్పుడు నాకు గుర్తులేదు.

కానీ భగత్ సింగ్ దేశభక్తి, ధైర్యం, భారతీయ మానవ సమాజం పట్ల ఆయనకున్న ప్రేమను గురించి కథలు కథలుగా వినడం నా అదృష్టం.నేను అతని గురించి చాలా విన్నాను.

అతని ధైర్యం సాటిలేనిదని నేను భావిస్తున్నాను.అలాంటి యువకుడికి, అతని సహచరులకు ఉరిశిక్ష విధించడం అంటే వారి తలలపై అమరవీరుల కిరీటాన్ని ఉంచడమే.

ఈ రోజు వేల మంది ప్రజలు అతని మరణాన్ని సొంత బంధువు మరణంగా భావిస్తున్నారు.నాకు తెలిసినంత వరకు, సర్దార్ భగత్ సింగ్ గురించి వ్యక్తీకరించేంత భావోద్వేగం ఎవరి దగ్గరా వ్యక్తం కాలేదు.

ఏ సందర్భంలోనైనా అతని త్యాగం, అతని శ్రమ, అతని అపరిమితమైన ధైర్యాన్ని యువత అనుకరించాలి, కానీ అతనిలోని కొన్ని లక్షణాలను, అతని కొన్ని చేతలను అనుసరించకూడదు.హత్యల ద్వారా మన దేశాన్ని రక్షించాలనుకోకూడదు.

భగత్ సింగ్ విప్లవకారుల హృదయాలను గెలుచుకున్నాడు.ప్రభుత్వం తన క్రూరమైన శక్తిని ప్రదర్శించడంలో చూపిన హడావిడి విస్మయపరుస్తోందని మహాత్మాగాంధీ పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube