ఏపీలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ తన కేబినెట్ విస్తరణకు వడివడిగా అడుగులు వేస్తున్నారు.తాను ఏం చేయాలనుకుంటున్నాడో అదే చేసే ధోరణిలోనే జగన్ పయణిస్తున్నాడు.
మంత్రి వర్గాన్ని మొత్తం ప్రక్షాళన చేసే దిశగా ఆలోచన చేస్తున్నారు.అయితే జిల్లాల బాధ్యతలు తీసుకునే విషయం లో కొందరు మంత్రులు సముఖంగా లేరని సమాచారం.
ఇందుకు సంబంధించిన నివేదికలు కూడా జగన్‌కు అందుతున్నాయట.అయినా జగన్ మాత్రం లైట్ తీసుకుంటున్నాడట.
చేసేవారు చేస్తారు… లేదంటే లేదనే అభిప్రాయంలో ఉన్నారట.అందుకే మంత్రి వర్గ విస్తరణపై మరింత కసరత్తు చేస్తున్నారని టాక్.
అయితే రాబోయే ఎన్నికలకు ముందు జరిగే మంత్రివర్గ మార్పులు ఎన్నికల కోసమేనని భోగట్టా.మరోసారి ఏపీలో అధికార పగ్గాలు చేజిక్కించుకునేందుకు జగన్ వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో గతంలో మంత్రి వర్గ కూర్పులో అన్ని సామాజిక వర్గాలకు ఆయన ప్రాధాన్యం కల్పించారు.ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉపముఖ్యమంత్రి పదవులు కూడా ఇచ్చిన విషయం విధితమే.
అలానే మంత్రులుగా ఎలివేట్ చేశారు.ఇప్పడు కూడా మరో వ్యూహంతో జగన్ ముందుకు వెళ్తున్నారని అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో మహిళలను తనవైపు తిప్పుకునేందుకు మహిళల సెంటిమెంట్ రాజేస్తున్నారని టాక్.ఒక్కసారి మహిళల్లో సెంటిమెంట్ వస్తే ఎన్నికల వరకు ఎవరు ఎన్ని ప్రలోభాలక గురిచేసినా ఫరక్ పడదని జగన్ భావిస్తున్నారని తెలిసింది.
అయితే మంత్రి వర్గ విస్తరణలో 50శాతం సీట్లను మహిళలకే కేటాయించాలని భావిస్తున్నారని తాడేపల్లి వర్గాలు పేర్కొంటున్నాయి.ఇప్పుడైతే మహిళా ఎమ్మెల్యేల సంఖ్య సుమారు 20కి పైగానే ఉంది.వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు కూడా ఉన్నారు.వీరికి మంత్రులగా అవకాశం ఇవ్వాలనేది జగన్ వ్యూహమని తెలుస్తోంది.ఇదే జరిగితే దేశంలో మహిళా ముఖ్యమంత్రి ఉన్న పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రంలో కూడా జరగని విధంగా మహిళా మంత్రులున్న రాష్ట్రంగా సంచలనం సృష్టించనుంది.ఇదే వ్యూహం అమలు చేస్తే సుమారు 10 నుంచి 12మంది మహిళలకు మంత్రి వర్గంలో చోటు లభించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.