అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ఆయనపై విమర్శలు వస్తూనే ఉన్నాయ్.ట్రంప్ అధికారంలో ఉండగా కరోనాను ట్రంప్ ఎదుర్కోలేక పోయాడంటూ విమర్శించిన బిడెన్ తాను అధికారంలోకి వచ్చిన తరువాత కరోనాపై పైచేయి సాధించలేక పోవడమే కాకుండా ట్రంప్ హయాం కంటే కూడా అత్యధిక మరణాలు, కేసులు నమోదు అవడంతో విమర్సల పాలయ్యారు.
అయితే ఇవేమీ మీడియాలోకి ఎక్కకుండా బిడెన్ జాగ్రత్తలు తీసుకున్నారు.ఇక ఆఫ్ఘాన్ విషయంలో బిడెన్ అత్యంత చెత్త నిర్ణయం తీసుకున్నారని ప్రపంచం ముందు అమెరికాను చిన్న బుచ్చేలా చేశారని పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చిపడ్డాయి.
ఎంతో మంది.
అమెరికా ప్రజలు, మేధావులు బిడెన్ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా.
బిడెన్ ఏ నిర్ణయం కూడా తనకు తానుగా తీసుకునే సామర్ధ్యత లేదని తన అనుచరగణం చెప్పింది చేస్తారని ఓ బొమ్మ అధ్యక్షుడు అంటూ ఓ వర్గం ప్రజలు ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు.బిడెన్ ఆరోగ్యంపై కూడా కామెంట్స్ వినిపించి కమలా హారిస్ అధ్యక్షురాలు అవుతారనే వార్తలు కూడా చెక్కర్లు కొట్టాయి.
బిడెన్ అధ్యక్షుడిగా పనికిరాడంటూ ఎంతో మంది విమర్శలు ఎక్కుపెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
తాజాగా అమెరికాకు చెందిన ఓ స్కూల్ లోని పిల్లలు సైతం బిడెన్ అధ్యక్షుడిగా పనికిరాడని వెంటనే పదవి నుంచీ దిగిపోవాలంటూ మూకుమ్మడిగా నినాదాలు చేసిన వీడియో ప్రస్తుతం హల్చల్ చేస్తోంది.అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటు చేసుకున్న ఈ ఘటన వైరల్ అవ్వడమే కాదు వివాదాస్పదంగా మారింది.సదరు స్కూల్ లో పనిచేస్తున్న ఓ టీచర్ బిడెన్ ను ఏం చేయాలి అని అడుగగా పిల్లలు అందరూ బిడెన్ పదవి నుంచీ దిగిపోవాలని అంటూ నినదించారు.
ఈ వీడియో కాస్తా వైరల్ అవడంతో స్కూల్ యాజమాన్యం స్పందించింది ఈ విషయంపై తాము చింతిస్తున్నామని, అధ్యక్షుడిని గౌరవించుకోవడం మాకు ఎంతో ముఖ్యమని, ఈ ఘటనపై విచారణ జరిపి టీచర్ పై చర్యలు తీసుకుంటామని తెలిపింది.కాగా నినాదాలు చేసిన పిల్లల తల్లితండ్రులు మాత్రం వారి పిల్లలను వేరే స్కూల్ లో చేర్చినట్టుగా తెలుస్తోంది.