విశ్వక్ సేన్ హీరో గా నటిస్తున్న `దాస్ కా ధమ్కీ` చిత్రం ప్రారంభం

ఫలక్నుమా దాస్, పాగల్, హిట్, చిత్రాల హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న నూతన చిత్రం `దాస్ కా ధమ్కీ` బుధవారం నాడు ప్రారంభమైంది.రామానాయుడు స్టూడియోలో ఆహ్లాదకరమైన వాతావరణం లో హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ నివేత పేతురాజ్ పై ముహూర్తపు సన్నివేశం చిత్రీకరించారు.దీనికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు.`ఎఫ్3` దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచ్చాన్ తో పాటు గౌరవ దర్శకత్వం వహించారు.సినిమా స్క్రిప్ట్ను నిర్మాత, దర్శకుడి కి రచయిత ప్రసన్నకుమార్ అందజేశారు.అనంతరం అల్లు అరవింద్ టైటిల్ లోగో ఆవిష్కరణ చేశారు.

 Hero Vishwak Sen Daas Ka Dhamki Movie Launched Details, Hero Vishwak Sen ,daas K-TeluguStop.com

ఈ సందర్భంగా అల్లు అరవింద్ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలుపుతూ, యంగ్ హీరోలలో నా కిష్టమైన వారిలో విశ్వక్ ఒకరు.విశ్వక్ తొలి సినిమా నుంచి పరిశీలిస్తున్నాను.

సంతోషం వచ్చినా ఏది వచ్చినా తట్టుకోలేడు.ఈ సినిమా మంచి విజయాన్ని చేకూర్చాలి.

నివేత పేతురాజ్ కూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.`ధమ్కీ` టైటిల్కు తగినట్లే కథ వుంటుందనీ, అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాని అన్నారు.

Telugu Allu Aravind, Anil Ravipudi, Daas Ka Dhamki, Dil Raju, Naresh Kuppili, Vi

అనిల్ రావిపూడి మాట్లాడుతూ, హీరోగా విశ్వక్ సేన్ స్వంత నిర్మాణం లో చేస్తున్న రెండో సినిమా ఇది.దాస్ కా ధమ్కీ అనేది చాలా బాగుంది.రచయిత ప్రసన్నకుమార్ నాకు దిల్రాజు గారి సినిమాల కు పనిచేసినప్పటి నుంచీ తెలుసు.మంచి స్క్రీన్ ప్లే రచయిత.పాగల్ దర్శకుడు నరేశ్ చేస్తున్న రెండవ సినిమా ఇది.విశ్వక్సేన్ మంచి స్నేహితుడు.మంచి విజయం చేకూరాలని ఆశిస్తున్నానని తెలిపారు.

Telugu Allu Aravind, Anil Ravipudi, Daas Ka Dhamki, Dil Raju, Naresh Kuppili, Vi

హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ, సినిమా రంగంలో పోటీ వున్నా ప్రేక్షకులు నన్ను గుర్తించి విజయాలు ఇచ్చారు.ఒక్క ఛాన్స్ కోసం వెతుకుతూ తిరిగే స్థాయి నుంచి నిర్మాతగా ఎదిగే స్థాయికి వచ్చేలా చేశారు.ఈ సినిమాకు అన్ని వనరులు సమకూరాయి.

మంచి టీమ్ దొరికింది.మంచి సినిమాలనే నేను తీస్తాను.

మాస్ అప్పీల్ వుండే సినిమా ఇది.థియేటర్ లో చూసిన ప్రేక్షకులు ఊగిపోయేలా వుండే కథ ఇది.కృష్ణదాస్గాడి జీవితంలో జరిగే కథే ఈ సినిమా.ఈనెల 14నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని అన్నారు.

హీరోయిన్ నివేత పేతురాజ్ మాట్లాడుతూ, విశ్వక్ సేన్ సినిమాలో నటించడం చాలా సంతోషంగా వుంది.కథ చాలా ఆసక్తిగా వుంది.అందుకే ఈ సినిమాలో నటించడానికి అంగీకరించానని అన్నారు.

చిత్ర నిర్మాత కరాటే రాజు వ్యాఖ్యానిస్తూ, ఫలక్నుమా దాస్ చిత్రం తర్వాత సేమ్ టీమ్తో చేస్తున్న సినిమా ఇది.మా బేనర్లో మంచి వినోదాత్మకమైన సినిమాలను తీయాలనే ప్రయత్నిస్తున్నామని అన్నారు.

Telugu Allu Aravind, Anil Ravipudi, Daas Ka Dhamki, Dil Raju, Naresh Kuppili, Vi

`ఈ సినిమా మంచి కథాంశంతో రూపొందుతోందనీ, అందరికీ ఈ చిత్రం మంచి పేరు తేవాలని` రచయిత ప్రసన్నకుమార్ ఆకాంక్షించారు.చిత్ర దర్శకుడు నరేశ్ కుప్పిలి తెలుపుతూ, పాగల్ సినిమా తర్వాత నేను చేస్తున్న సినిమా ఇది.రచయిత ప్రసన్న ఈ సినిమాకు ఎసెట్.లియో బాణీ లు చక్కగా వచ్చాయని` తెలిపారు.`ఈ సినిమాకు మంచి పాటలు కూడా కుదిరాయనీ, సంగీతం బాగా అమరిందని, పాగల్ తర్వాత చేస్తున్న చిత్రమిదని` సంగీత దర్శకుడు లియోన్ జేమ్స్ పేర్కొన్నారు.

`విశ్వక్ హీరోగా మరింత పై స్థాయికి ఎదగాలని` చిన్న శ్రీశైలం యాదవ్ ఆకాంక్షించారు.రంగస్థలం మహేష్ మాట్లాడుతూ, నరేశ్ ప్రతిభగల దర్శకుడు.

చాలా కాలం నుంచి తెలుసు.పాగల్ తో తనేంటో నిరూపించుకున్నాడు.ఈ సినిమాకు రచయిత ప్రసన్నకుమార్ తో పాటు అందరూ మంచి టీమ్ కుదిరిందని తెలిపారు.

నటీనటులు

విశ్వక్ సేన్, నివేత పేతురాజ్.

సాంకేతిక సిబ్బంది

నిర్మాతః కరాటే రాజు, దర్శకత్వం : నరేశ్ కుప్పిలి, రచయితః ప్రసన్నకుమార్ బెజవాడ, కెమెరాః దినేష్ కె.బాబు, సంగీతం: లియోన్ జేమ్స్, ఎడిటర్ః అన్వర్ అలీ, ఆర్ట్ః ఎ.రామాంజనేయులు, పి.ఆర్.ఓ.వంశీ, శేఖర్, పబ్లిసిటీ డిజైనర్ః పద క్యాసెట్ట్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube