వచ్చీ రావడంతోనే ముద్దు ఇచ్చా!.. సాయి కుమార్‌తో రోహిణి రొమాన్స్

టాలీవుడ్ ఇండస్ట్రీకి సీనియర్ హీరో సాయి కుమార్ గురించి అందరికీ పరిచయమే.తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

 Actress Rohini Gave Kiss To Saikumar In Wow Show Details, Rohini, Tollywood, Rom-TeluguStop.com

కేవలం నటుడుగానే కాకుండా డైలాగ్ కింగ్ గా ప్రత్యేక గుర్తింపు పొందాడు.నిజానికి కెరీర్ మొదట్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలో అడుగుపెట్టాడు.

ఎన్టీఆర్‌, ఏఎన్ఆర్ లు నటించిన సంసారం అనే సినిమాతో తన డబ్బింగ్ ను మొదలుపెట్టాడు.ఇక ఆ తర్వాత బాలనటుడుగా అవకాశాలు అందుకున్నాడు సాయికుమార్.అలా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత హీరోగా పరిచయమై మంచి సక్సెస్ లు అందుకున్నాడు.

అలా హీరో స్థానం నుండి సహాయ పాత్రలలో, నెగటివ్ పాత్రలో నటించి మంచి మార్కులు సంపాదించుకున్నాడు.చాలా వరకు తండ్రి పాత్రలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.

ఈయన ఇప్పటికీ పలువురు హీరోలకు డబ్బింగ్ చెబుతూనే ఉన్నాడు.ఇక ఈయన బుల్లితెరపై కూడా వావ్, మనం అనే షోలలో వ్యాఖ్యాతగా బాధ్యతలు వ్యవహరించాడు.

ఇదిలా ఉంటే ఈయనతో తాజాగా నటి రోహిణి రొమాన్స్ చేసింది.ఆయన దగ్గరికి రావడం రావడం తోనే ముద్దులతో రచ్చ చేసింది.ఇంతకు అసలేం జరిగిందంటే.సాయి కుమార్ ప్రస్తుతం ఈటీవీ లో వావ్ 3 సీజన్ లో వ్యాఖ్యాతగా చేస్తున్న సంగతి తెలిసిందే.ప్రతి మంగళవారం ప్రసారమయ్యే ఈ షో.వచ్చే వారం కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.

అందులో సెబాస్టియన్ సినిమాలో నటించిన కిరణ్, రవితేజ, కోమలి, రోహిణి పాల్గొన్నారు.ఇక వీరందరికీ సాయికుమార్ వెల్ కమ్ చెప్పి షోలోకి ఆహ్వానించాడు.అదే సమయంలో సినీ నటి రోహిణి సాయి కుమార్ తో మాట్లాడుతూ తను అక్కడికి వచ్చినప్పుడు ఆయనకు ముద్దు ఇచ్చినట్లు చూపిస్తూ తెలిపింది.

దీంతో సాయికుమార్ కూడా ఆ ముద్దును రొమాంటిక్ గా తీసుకొని తన గుండెల్లో దాచుకున్నాడు.వెంటనే రోహిణి ఆ మూమెంట్ ను చూసి నవ్వుకుంది.ఈ షోకి నటి రోహిణి రావటం మరింత కిక్ అని సాయి కుమార్ అన్నాడు.

రోహిణి కూడా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక సాయి కుమార్ కాసేపు వాళ్ళు నటిస్తున్న సినిమా గురించి కొన్ని విషయాలు చర్చలు చేశాడు.

ఇక వారితో గేమ్స్ ఆడిస్తూ బాగా సందడి చేశాడు.మొత్తానికి ఈ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ గా మారింది.

ఇక ఈ షో మార్చి 8న ఈటీవీ లో ప్రసారం కానుంది.

సాయికుమార్ సినిమాల విషయానికి వస్తే గత ఏడాది వరుసగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఇక ఈ ఏడాది రాజావిక్రమార్క సినిమాలో హోం మంత్రి పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.ఇక ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube