పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన భీమ్లా నాయక్ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంది.
సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు అంటే మొత్తం సక్సెస్ క్రెడిట్ అంతా ఆ హీరో కి వెళ్లి పోతుంది.కానీ భీమ్లా నాయక్ విషయంలో మాత్రం అలా జరగడం లేదు.
సక్సెస్ క్రెడిట్ అందరికీ కూడా దక్కుతుంది.మీడియాలో అన్నివర్గాల వారిని కూడా ఈ సినిమా ఆకట్టుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
దాంతో ఈ సినిమాకు రచన సహకారం అందించిన దర్శకుడు త్రివిక్రమ్ నుండి మొదలుకొని సంగీత దర్శకుడు థమన్ మరియు ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సాగర్ కే చంద్ర ఇలా ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ క్రెడిట్ దక్కింది అంటూ టాక్ వినిపిస్తుంది.ముఖ్యంగా పవన్ కు ఏమాత్రం తగ్గకుండా రానా నటించాడంటూ యూనిట్ సభ్యులు కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా జరిగిన సక్సెస్ మీట్ లో కూడా ఈ సక్సెస్ కు అందరం కారణం అంటూ త్రివిక్రమ్ వ్యాఖ్యలు చేశాడు.పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే కచ్చితంగా అభిమానుల్లో క్రేజ్ ఉంటుంది.
ఆ క్రేజ్ కారణంగా సక్సెస్ క్రెడిట్ మొత్తం ఆయనకే ఇస్తారు.కానీ ఈ సారి మాత్రం మాటలు రాసిన త్రివిక్రమ్, దర్శకత్వం వహించిన సాగర్ కే చంద్ర ఇంకా సంగీతం అందించిన తమన్ కి ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఆ సక్సెస్ లో భాగస్వామ్యం ఉందంటూ రివ్యూ లు వస్తున్నాయి.
భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా ఈ విషయం లో అదే స్థాయిని కొనసాగించింది.మొదటి రోజే ఈ సినిమా ఏకంగా 40 కోట్ల వరకు వసూలు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.ఏపీలో టికెట్ల రేట్లు ఎక్కువగా ఉన్నట్లయితే రూ.50 కోట్ల వరకు కూడా ఈ కలెక్షన్లు చేరి ఉండేవన్న టాక్ వినిపిస్తుంది.ఏపీలో అదనపు షో లు మరియు బెనిఫిట్ షో లకు ఛాన్స్ ఇచ్చి ఉంటే ఈజీగా 50 కోట్లు దక్కి ఉండేవి.కాని జగన్ ప్రభుత్వం అందుకు సహకరించలేదు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.