“బీమ్లా నాయక్” రేపు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం సినిమా థియేటర్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుందని.
ఒక పక్క తెలుగుదేశం పార్టీ నేతలు ఈరోజు మీడియా ముందు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.పవన్ కళ్యాణ్ ని జగన్ ప్రభుత్వం టార్గెట్ చేసింది అని విమర్శలు చేస్తూ ఉన్నారు.
ఇటువంటి తరుణంలో తాజాగా పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ఒక సంచలన పోస్ట్.పెట్టి ఇది నా ఆల్ టైం ఫేవరేట్ కొటేషన్ లలో ఒకటి అని పోస్ట్ చేశారు.
పాస్టర్ మార్టిన్ నిమోలార్… జర్మనీ నాజీ నిరంకుశత్వం గురించి పోస్ట్ చేస్తూ.అప్పట్లో.నాజీలు .ఒక్కొక్కరినీ అణిచివేస్తున్న సమయంలో చేసిన కొటేషన్… చాలా గొప్ప సత్యం అని పేర్కొంటూ…”వాళ్లు మొదట సోషలిస్టుల కోసం వచ్చారు… కానీ నేను ఏం మాట్లాడలేదు.ఎందుకంటే నేను సోషలిస్టును కాదు కాబట్టి.వాళ్లు కార్మిక సంఘాల నాయకుల కోసం వచ్చారు… నేను ఏమీ మాట్లాడలేదు… ఎందుకంటే నేను కార్మిక సంఘం నాయకుడ్ని కాదు కాబట్టి.
వాళ్లు యూదుల కోసం వచ్చారు… అప్పుడు కూడా నేను ఏమీ మాట్లాడలేదు… ఎందుకంటే నేను యూదుడ్ని కాదు కాబట్టి.ఈసారి వాళ్లు నాకోసమే వచ్చారు… అయితే నాకోసం మాట్లాడేందుకు ఒక్కరూ మిగల్లేదు” అంటూ.అప్పటి పరిస్థితులను తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు.బీమ్లా నాయక్ సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని.దాన్ని ఉద్దేశించే పవన్ ఈ పోస్ట్ పెట్టి నట్లు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.