గుడ్ న్యూస్, యాపిల్‌కు దీటుగా మారబోతున్న ఆండ్రాయిడ్.. ప్రైవసీలో కీలక మార్పులు..

ప్రైవసీ విషయంలో యాపిల్‌కు మించిన ఆపరేటింగ్ సిస్టం లేదంటే అతిశయోక్తి కాదు.ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ కంటే యాపిల్ తయారుచేస్తున్న ఐఫోన్ చాలా కట్టుదిట్టమైన భద్రతతో వస్తుంది.

 Google Making Privacy Changes In Android Os Details, Good News, Google, Pricy Po-TeluguStop.com

అందుకే ప్రైవసీ కోరుకునేవారు యాపిల్ ఫోన్లను కొనుగోలు చేస్తుంటారు.అయితే యాపిల్ అందిస్తున్న ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టంలోని ప్రైవసీ ఫీచర్లు చాలా మెరుగ్గా ఉంటాయి.

ముఖ్యంగా యాడ్స్ ట్రాకింగ్ విషయంలో యాపిల్ సంస్థ ఐఫోన్ యూజర్లకు చక్కటి ప్రైవసీ కంట్రోల్స్ ఆఫర్ చేస్తుంది.అయితే ఇప్పుడు గూగుల్ కూడా అదే బాటలో నడుస్తూ దాని కంటే మెరుగైన సేవలను అందించేందుకు సిద్ధమయ్యింది.

వాస్తవానికి గత ఏడాది ఏప్రిల్‌లోనే ఐఫోన్స్ కోసం యూజర్ ప్రైవసీ పాలసీని యాపిల్ పరిచయం చేసింది.ఈ ప్రైవసీ పాలసీని మొబైల్ యూజర్లు బాగా పొగిడారు.ఈ పాలసీ సాయంతో యూజర్లు తమ ఫోన్‌లో ఏం చేస్తున్నారనేది యాప్స్ ట్రాక్ చేయకుండా నిలిపేయవచ్చు.అయితే సాధారణంగా యాప్స్ పర్మిషన్ ఇస్తే చాలు యూజర్ల బిహేవియర్ మొత్తం ట్రాక్ చేస్తుంటాయి.

కానీ కొత్త యూజర్ ప్రైవసీ పాలసీ సాయంతో మాత్రం యాప్స్ ట్రాక్ చేయాలా?? వద్దా?? అనేది యూజర్లు సొంతంగా సెలెక్ట్ చేసుకోవచ్చు.దీనివల్ల అనవసరమైన యాడ్స్ తోపాటు అన్ని బ్లాక్ అవుతాయి.

అయితే ఆండ్రాయిడ్ కూడా ఇదే ప్రైవసీ పాలసీని తీసుకురావాలని యోచిస్తోంది.యాడ్ ట్రాకింగ్‌కు సంబంధించి ప్రైవసీ మార్పులు పరిచయం చేయాలని గూగుల్ ఆలోచిస్తున్నట్టు తాజాగా ఆ సంస్థ ప్రతినిధి వెల్లడించారు.అయితే ఈ ప్రైవసీ పాలసీని తీసుకు రావాలంటే కనీసం రెండేళ్ల సమయం పడుతుందని ఒక గూగుల్ ఉద్యోగి తెలిపాడు.

యాప్స్ నుంచి యూజర్ల యాక్టివిటీని ట్రాక్ చేసి ప్రకటనలు డిస్‌ప్లే చేసే సంస్థలకు ఈ ప్రైవసీ చేంజెస్ ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంది.

ముఖ్యంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ లాంటి సంస్థలకు ఇది పెద్ద ఎదురుదెబ్బ గా మారే ప్రమాదం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube