‘భీమ్లా నాయక్‘ సినిమా ఫిబ్రవరి 25వ తారీకు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
ఇక ఇదే సమయంలో సినిమాకి స్క్రీన్ ప్లే మరియు డైలాగులు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించడంతో సినిమా విడుదల కోసం అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉన్నారు.కాగా వచ్చే సోమవారం హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ వేడుక అంగ రంగ వైభవంగా జరపడానికి సినిమా యూనిట్ రెడీ అయింది.
అయితే ఈ వేడుకకు టిఆర్ఎస్ పార్టీ కీలక నేత మంత్రి కేటీఆర్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు.ఈ వార్త తో పవన్ ఫ్యాన్స్ తో పాటు టిఆర్ఎస్ పార్టీ నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు.
ఈ సినిమాలో సంయుక్త మీనాన్, నిత్య మీనన్ హీరోయిన్లుగా నటించడం జరిగింది.తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి హైలెట్ గా నిలుస్తుందని టైటిల్ సాంగ్ బట్టి బయట జనాలు ఆశిస్తున్నారు.
దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పవన్ సినిమా విడుదల అవుతుండటంతో.మెగాభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.