తెలుగు సినిమా పరిశ్రమలో మూవీ మొఘల్ గా పేరు తెచ్చుకున్న దిగ్గజ నిర్మాత రామానాయుడు. సినీ నిర్మాణ రంగానికి విలువులు అద్దిన గొప్ప మనిషి.
నిర్మాత అంటే డబ్బులు, లాభాలే కాదు.జనానికి ఉపయోగపడే సబ్జెక్టును తీసుకుని ప్రేక్షకుల మనసును దోచేవాడు అని నిరూపించిన వ్యక్తి.1960 నాటికి తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో మార్పులు వచ్చాయి.అప్పటికే తెలుగు సినీ తెరపై పౌరాణిక, జానపద సినిమాలు ఓ వెలుగు వెలుగుతున్నాయి.
అలాంటి సమయంలో నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రామానాయుడు.
రామా నాయుడు ప్రకాశం జిల్లాలో పుట్టాడు.
కారంచేడు లోని ఓ భూస్వామి ఇంట జన్మించాడు.తొలి రోజుల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసిన రామా నాయుడు ఆ తర్వాత సినిమాలపై మనసు పెట్టాడు.
తన కుటుంబ సభ్యులకు సినిమా రంగం మీద మంచి అభిప్రాయం లేదు.అందకే వద్దని చెప్పారు.
కానీ తాను ఎలాంటి చెడు అలవాట్ల జోలికి పోనని చెప్పి మద్రాసుకు వెళ్లాడు రామానాయుడు.తొలుత అనురాగం అనే సినిమాకు భాగస్వామి నిర్మాతగా చేశాడు.
ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ ను స్థాపించాడు.ఎన్టీఆర్ హీరోగా రాముడు భీముడు అనే సినిమా చేశాడు.
తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు.ఆ తర్వాత శ్రీకృష్ణ తులాభారం సినిమా చేశాడు.ఈసినిమా కూడా అద్భుత విజయాన్ని అందుకుంది.ఆ తర్వాత ఏఎన్నార్ తో కలిసి ప్రేమ్ నగర్, సెక్రెటరీ సినిమాలు చేసి అద్భుత విజయాలు అందుకున్నాడు.శోభన్ బాబుతో సోగ్గాడు, దేవత లాంటి బ్లాక్ బస్టర్లు సాధించాడు.వరుస విజయాలతో జనాలకు మరింత దగ్గరయ్యాడు రామానాయుడు.
సినిమా క్వాలిటీ దెబ్బ తినకుండా వీలైనంత తక్కువకు ఖర్చును కుదించే వాడు రామానాయుడు.రచయితలో కలిసి ఎన్నో కథల గురించి చర్చించే వాడు.ఏపాత్రకు ఎవరు బాగుంటారు? అని డిసైడ్ చేసేవారు.పాటల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టేవాడు.
అందుకే ఆయన బ్యానర్లో వచ్చిన చాలా సినిమా సంగీత పరంగా చాలా బాగుంటాయి.తెలుగులోనే కాదు.మిగతా భాషల్లో కూడా ఆయన ఎన్నో సినిమాలు చేశాడు.ఎంతో మంది నటీనటులను, సాంకేతిక నిపుణులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.వెంకటేషన్ ను హీరోగా, సురేష్ బాబును నిర్మాతగా సెటిల్ చేశాడు.సురేష్ ప్రొడక్షన్స్ ను అగ్రస్థాయిలో నిలిపి రఘుపతి వెంకయ్య అవార్డుతో పాటు పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాలను అందుకున్నాడు.
నిర్మాతలకు రోల్ మోడల్ గా నిలిచాడు.