పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టార్ చిత్రం సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్.ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇకపోతే ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఒక పాట చిత్రీకరణ జరుపుకుంటుంది.ఇక ఈ సినిమాలో పాటలు పాడడం కోసం చిత్రబృందం బాలీవుడ్ సూపర్ సింగర్ ను రంగంలోకి దించారు.
మహేష్ బాబు కొరటాల కాంబినేషన్ లో వచ్చిన భరత్ అనే నేను సినిమాలో వచ్చాడయ్యో సామి అనే పాట ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కైలాష్ ఖేర్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రంలో ఓ పాట పాడనున్నట్లు తెలుస్తుంది.పవన్ కళ్యాణ్ సినిమా కోసం బాలీవుడ్ సింగర్ తన గాత్రాన్ని వినిపించబోతున్నారు.
ఇకపోతే ఈ సినిమాకి స్క్రీన్ ప్లే దర్శకత్వం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బాధ్యతలు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇందులో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సందడి చేయనున్నారు.
ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించి వీలైనంతవరకు ఈ సినిమాని ఫిబ్రవరి 25వ తేదీన విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఫిబ్రవరి 25వ తేదీ ఈ చిత్రం విడుదల కాని పక్షంలో ఈ సినిమాని ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేయనున్నారు.అయితే ఈ సినిమా విడుదల గురించి చిత్రబృందం అధికారిక ప్రకటన తెలియజేయాల్సి ఉంది.ఇక ఇందులో నిత్యామీనన్, మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.